పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

656 రేకు: 0156-02 గౌళ సంపుటము: 02-264 పల్లవి: నమ్మవలెఁగాని యెన్నఁడు సందేహము లేక యిమ్ముల దేవుఁడు వరమిచ్చుటేమరుదు చ. మగనిపై బత్తిసేసి మంచిలోకా లెక్కేరట తగుదండకోల వట్టి తత్త్మగతి గనేరట పగటున నొకవేరు వట్టి పాముఁ బట్టేరట తగిలి హరిదాసులు ధన్యు లౌ టేమరుదు చ. యేలికెకు ధనమిచ్చి హితభోగా లందేరట కేలఁగత్తివూని పగ గెల్చేరట గాలి లోలోఁ బూరించి ఘనసిద్దులయ్యేరట యేలీల హరిదాసులు యివాడేరు టేమరుదు చ. దిక్కుల యజ్ఞాలు చేసి దివిజులయ్యేరట మొక్కి విప్టుల నర్చించి ముంచి సిరు లందేరట పక్కన నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరుఁ జక్కనఁ గొల్చిన దాసులు జ్ఞాను లౌ టేమరుదు పె.అ.రేకు:0056-01 శుద్ధవసంతం సంపుటము: 15-319 పల్లవి: నమ్మి కొలువఁగదరో నరులాల శ్రీహరిని కమ్మియీతఁడే బ్రహ్మగన్నతండ్రి గాఁడా చ. దోసిట మద్దెత్తేవేళ తోడై వచ్చే దైవము రాసికెక్కఁ గొలిచితే రక్షింపఁడా బాసలఁ బాము మంత్రము పంపు సెయించే దేవుఁ డాసఁ దన్నుఁ దలఁచితే నటు పంపు సేయఁడా చ. నాలిక గోసి పెట్టితే నలి మొలపించే దైవ మేలికని కొలిచితే నీడేర్చఁడా ఆలించి దారు శిలలఁ దా వహించే దేవుఁడు వొలిఁ దనమనసులో నూహించితే లేఁడా చ. పడినెడ మొక్కుకొన్నా వర మిచ్చే దేవుఁడు కడు గరుడగంబముకాడ నియ్యఁడా వెడ తీర్థయాత్రలకు వెస మెచ్చే దేవుఁడు అడరి శ్రీవేంకటేశుఁ డండ నుంటే మెచ్చఁడా రేకు: 0384-01 దేవగాంధారి సంపుటము: 04-487 పల్లవి: నమ్మితిఁజుమ్మీ వోమనసా నాకే హితవయి మెలంగుమీ ముమ్మాటికి నేఁ జెప్పితిఁజుమ్మీ మురహరునామమే జపంచుమీ చ. తలఁచకుమీ యితరధర్మములు తత్వజ్ఞానము మఱవకుమీ కలఁగకుమీ యేపనికైనను కడు.శాంతంబుననుండుమీ వలవకుమీ వనితలకెప్పుడు వైరాగ్యంబున నుండుమీ కొలువకుమీ యితరదైవములు గోవిందునినే భజించుమీ చ. కోరకుమీ దేహభోగములు గొనకొని తపమే చేకొనుమీ మీరకుమీ గురువులయానతి మెఱయఁ బురాణములే వినుమీ చేరకుమీ దుర్జనసంగతి జితేంద్రియుఁడవై నిలువుమీ దూరకుమీ కర్మఫలంబును ధ్రువవరదునినే నుతించుమీ చ. వెఱవకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుఁడవగుమీ మఱవకుమీ యలమేల్మంగకుమగఁడగు శ్రీవేంకటపతిని కెఱలకుమీ మాయూరతులను కేవలసాత్వికుఁడవుగమ్మీ తొఱలకుమీ నేరములను సింధురక్షకునినే సేవించుమీ