పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

634 సతులంటా సుతులంటా సంసారినైతి గతియై శ్రీవేంకటేశ కాచితి వింతటిలోనే యితరుఁడ నింతే నీకు నేమి బాఁతి నేను పె.అ.రేకు:0066-05 గుజ్జరి సంపుటము: 15-380 పల్లవి: దైవము చేసిన సేఁత తప్పించ రాదు కావలసిన పనులు కాక మానవు చ. పొంకము గానివానికి బుదు లెన్ని నేరిపినా వంకర కొంకరే కాని వశము గాఁడు సంకుఁ బూస దెచ్చి యెంతసానఁబట్టి తోమినాను సుంకించి ముత్యముతోడి సూటికి రాదు చ. యెలమితోఁ గురూపి నెంత సింగాలించినాను అలయికలే కాని అందము గాదు మలసి యిత్తడి దెచ్చి మాడలుగాఁ జేసితేను కల సహజమే కాని కనకము గాదు చ. యిరవుగా నిగ్గడికి నెంత పెండ్లి సేసినాను పొరపాచ్చెమె కాని పొందఁగ రాదు సరుగ శ్రీవేంకటేశ్వరు దాసుఁడైతేఁ గాని సరి నేమిటా జ్ఞానము సమకొనరాదు రేకు:0145-05 పాడి సంపుటము:02-204 పల్లవి: దైవము తోడిదే తన తగులు జీవుడిఁది యెఱిఁగితే చిక్కనీదు తగులు చ. కన్నులఁ జూచినంతనే కలుగునుఁ దగులు మిన్నక మాటలాడితే మిగులాఁ దగులు పన్నుగా నవ్వితేను పాదుకొనుఁ దగులు యెన్నెనా నూరకుండితే నేమీ లేదు తగులు చ. వీనులొగ్గి వినఁబోతే విశ్వమెల్లాఁ దగులు ఆనుక సహవాసాన నOటుకొరినుఁ దగులు పూని లోకుల పొందుల పొదిగొను తగులు మోనాన నూరకుండితే మొగియదు తగులు చ. కరుణించి యేమిచ్చినా గట్టియవునుఁ దగులు దొరతనాన మించితే తొడరును తగులు ధరణి శ్రీవేంకటేశుఁ దలఁచి యేకాంతాననిరవై వూరకుండితే నెనయదు తగులు రేకు: 0345-06 నాదరామక్రియ సంపుటము: 04–267 పల్లవి: దైవము దూరఁగనేల తమనేర్పు నేర మింతే యీవలఁ దమకర్మము లెంచరు మనుజులు చ. మొల్లమి గాలియొకటే ముంచి తూరుపెత్తుచోట పొల్లకట్టు కడఁబడె పోగువడె గట్టివెల్లా వుల్లములో శ్రీహరి ఒకఁడై వుండునతనినొల్లరైరి యసురలు వొలిసిరి సురలు చ. మించిన జల్లి యొకటె మీఁదనుండు దొడ్డవెల్ల చంచుల సన్నములెల్లా సందులఁ గారు యెంచఁగ హరి యొకఁడే యెరఁగక కొందరైతే కొంచమై రీతనిఁ గొల్చి కొందరైతె ఘనులు చ. కోవిలలుఁ గాకులును కోరి యొక్కరీతి నుండు