పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

635 యీవల వసంతవేళ నేరుపడును శ్రీవేంకటేశ్వరుని సేవకులు మనుజులభావ మొకరీతి నుండు ఫలములే వేరు రేకు: 0350-04 నాగవరాళిసంపుటము: 04-294 పల్లవి: దైవము నెరఁగము తత్వముఁ దలఁచము చేవై హరి రక్షించీ నిదివో చ. పాపముఁ బుణ్యముఁ బైకొను దేహము కోపము శాంతపుగుణములది వోపికవోపము లుదుటు చూపెడిది చేపట్టుక యిటు చెలఁగే మిదివో చ. వెలికిని లోనికి విడిసేటిప్రాణము చలువలు వేండ్లు చల్లెడిది తెలివికి నిదురకుఁ దే పై యున్నది బలిమిఁ జేపట్టుక బ్రదికే మిదివో చ. పరమును నిహమునుఁ బట్టినజీవుఁడ పొరుగుకు నింటికిఁ బొత్తెతి గరిమల శ్రీవేంకటపతి శర్ణని నిరతపు మహిమల నెగడే మిదివో రేకు:0095-06 ముఖారి సంపుటము: 01-476 పల్లవి: దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాలిగుణ మేల విడుచు చ. ఆరయఁ బంచదార నదుక తినఁబోతే చేరరాని ముష్టిగింజ చేఁదేల మాను సారమైన చదువులు సారె సారెఁ జదివినా గోరపు దుషునికి కోపమేల మాను చ. నిప్పు దెచ్చి వొడిలోన నియమానఁ బెట్టుకొంటే యెప్పుడును రాఁజుఁగాక యిది యేల మాను ముప్పిరిఁ బాతకుఁడైన మూడుఁడెన్ని యాచారాలు తప్ప కెంతసేసినాను దయ యేల కలుగు చ. యింటిలోనఁ గొక్కు దెచ్చి యిరవుగఁ బెట్టుకొంటే దంటంమై గోడలు వడఁదవ్వ కేలమాను గొంటరై శ్రీవేంకటేశుఁ గొలువకుండినవాఁడు తొంటి సంసారవుఁగాక దొర యేఁటి కౌను పె.అ.రేకు: 0035-03 సామంతంసంపుటము: 15-197 పల్లవి: దైవమూ నొక్కఁడె తాను నెప్పటివాఁడె సేవించినకొలఁదినే చేకూడు శుభము చ. మింట సూర్యుఁ డొక్కఁడై మించి యూఁడు గాలముల అంటి గుణములు వేరులై తోఁచీని దంట కిరణము లేమీ దాఁచఁడు కొన్ని దేఁడు వెంట దగ్గరినపాటి వెలుఁగిచ్చు నతఁడు చ. అంది దేహ మొక్కటే ఆఁకటి భోజనమున అందపు రెండు భావములై తోఁచీని పొందిన ఆఁకలి యెందుఁ బోదు కొత్తగా రాదు అంది భుజించినపాటి యూనందము చ. తలఁపులోని నాడె తగ శ్రీ వేంకటేశుఁడు