పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/635

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

633 తమకు నెక్కుడై తోఁచు తక్కువనరు నెమకి శ్రీవేంకటేశ నీదాసులకే కాని భ్రమసిన జీవులెల్లాఁ బాయరు నీమాయ రేకు:0047-06 లలిత సంపుటము: 01-291 పల్లవి: దైవమా పరదైవమా యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో చ. పాపకర్మునిఁ దెచ్చి పరమియ్యఁదలఁచిన మేపులకే పాణిక మెయుకొనీనా తీపులు రూపులుఁ దివిరి నా వెనువెంటనేపాదు నీ వేఁడఁ దెచ్చేవో చ. అధమాధమునిఁ దెచ్చి యధికుని జేసేనంటే విధినిషేధములు వివరించునా నిధినిధానములు నిచ్చనిచ్చలుఁ బెక్కువిధముల నెటువటే వెదచల్లెదవో చ. అతికష్టుఁడగునాకు నలవిగానియూ మత మొఁసగిన నేను మరిగేనా ప్రతిలేని వేంకటపతి నీదునామామృత మిచ్చి నను నీవే మెరయింతుగాక రేకు:0263–02 మలహరి సంపుటము: 03-362 పల్లవి: దైవమా యేమి సేతు తలఁప నీవే దిక్కు భావించి చదువఁబోయి పశుబుద్ధినైతి చ. కననా సంసారము కడలేని భారమయోట కనినాఁ దొరెలఁగరాదు కాలురులు విననా యీ దేహము విరసపు హేయమనౌట వినినా జిగురుఁ గండె విడిపించరాదు చ. తెలియనా ఇంద్రియాలు బ్రిష్టపు విరోధమాట తెలిసినాఁ బోఁగువలెఁ దెంచరాదు పలుకనా పాపములు పాయుని బOధములని పలికినాఁ గొన్న వెట్టి పట్టితోయరాదు చ. యొఱఁగనా యీలోకమిది మాయమయమని యెఱిఁగినాఁ బడ్డవోఁద మెక్కరాదు మెఱయ శ్రీవేంకటేశ మేనిలోననే వుండి మఱియును నన్నునేల మన్నన సేసితివి రేకు:0230-04 ముఖారి సంపుటము: 03–171 పల్లవి: దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెట్టివాఁడనైతే నీవు వెట్టివా చ. చవిగొంటి నెత్తురెల్లా చన్నుఁబాలనుచు నేను భువిఁ దొల్లే నోచితి పుట్టేనంటాను యివల గడుపులోన హేయమనౌతాఁ గూడవుతా నివిరి నన్నెరఁగను నిన్నెరిఁగేనా చ. మొగిఁ జావుకు వెరతు ముందర గాన నేను వెగటు లంపటమైతే వేసరుకొందు వగపును నగవును పడి నొక్క మొకమందే తగులైనవాఁడ నీపై తలఁపు నాకున్నదా చ. మతి భ్రమసితిఁ గొంత మన్ను నాకు రాజ్యమని