పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

632 నిగ్గుల శ్రీవేంకటేశ నీవు నన్ను నేలుకొని దగ్గరి నాలోనుండఁగా తలపూఁగైవాలదు రేకు: 0335-01 నాగవరాళి సంపుటము: 04-202 పల్లవి: దైవమా నీవే దయాధర్మము దలఁచు టింతే వావిరి నౌఁగాదన నవ్వల నిఁక నెవ్వరో చ. యెంచఁగ నీదేహమిది యింద్రియాదులకుఁ జరఁ వంచనతో విడిపించువారలెవ్వరో పంచభూతాలకుఁ జర బ్రదికేటి బ్రదుకెల్ల యించుకంత దయఁజూడ నిఁక నెవ్వరో చ. పోరచి నామన సిది పుణ్యపాపాలకుఁ జర మారుకొని విడిపించ మరి యెవ్వరో తీరని నాజన్మమిది దినభోగాలకుఁ జర యీరీతి విడిపించ నిఁక నెవ్వరో చ. ఆతుమ యునాదినుండి హరి నీ భక్తికిఁ జర ఆతల నెవ్వరికైనా నరుహమూనా యీతల శ్రీవేంకటేశ యిటు నీవే కాతుగాక పూతల నీదాసులకు గతి యెవ్వరో రేకు:0137-05 ధన్నాసి సంపుటము: 02-158 పల్లవి: దైవమా నీవే మమ్ము దయదలఁచుట గాక చేవల నీసేఁతలెల్ల చెల్లును లోకానను చ. తీపు నంజేవేళ నట్టె తేటఁ బులుసింపౌను పైపైఁ బుణ్యమయితేఁ బాపమింపౌను వోపి జంతువుల కివి వొకటొకటికి లంకె చేపట్టి పాపము లెట్టు సేయకుండవచ్చును చ. కడుఁ జలువై తేను గక్కన వేఁడింపౌను చెడని విరతివేళ సిరులింపౌను వొడలు మోచినవాల కొరెకటికటికి లంకె తొడరు భోగాలు మాని తోయ నెట్టవచ్చును చ. యివియు నీమాయే యిన్నియు నీయాజ్ఞలే జవళిఁ బ్రాణులకెల్ల సమ్మతైనవి యివల శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి తవిలి నీవే గతి దాఁగ నెట్టవచ్చును రేకు:0295-04 కన్నడగౌళ సంపుటము: 03-551 పల్లవి: దైవమా నీవే యిందు దయ దలఁచుటఁ గాక తోవనున్న జీవులెట్లు తోసేరు నీమాయ చ. పలుచవులందునెల్ల ప్రాణమే మిక్కిలి చవి బలిమి తీపులలోనఁ బ్రాణమే తీపు యిలపైఁ బూజ్యులలోన నింతులే కడుఁబూజ్యులు తలఁచి జీవులు యెట్టు దాఁటేరు నీమాయ చ. తగు చుట్టరికాలలో ధనమే చుట్టరికము జగతిఁ గట్టని కట్టు సంసారము వగలైన గుణాలలో వైరమే నిజగుణము జిగిఁ బ్రాణులెట్లు గెలిచేరు నీమాయ చ. తమలో నెవ్వరికైనా తమ జాతి తమ నేర్పు