పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

631 ఆదిమూర్తి నీకు శరణాగతులము యీదెస శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె నీదయ గలుగఁగాను నీ వారము పె.అ.రేకు:0077-02 సామంతం సంపుటము: 15-442 పల్లవి: దైవమా నీతప్ప లేదు తలఁచేవారి భాగ్యమే వేవేలుగా మతియించీ వేదములే నిన్నును చ. నీవు గలవనేచోట నీ గుణములు గలవే నీవు లేని చోట నిరుణ మౌను భావించితే మనసులోఁ బరగు నీ సాకారము ఆవల నిన్నుఁగానని దది నిరాకారము చ. యెఱిఁగి కనుఁగొంటేను యీ జగమెల్లా నిజము యెఱుఁగక మఱచితే నింతా మిథ్యా వుఱక భక్తి సేసితే నుండు నందు భేదము నెఱయా నొల్లకుండితే నిలుచు నభేదము చ. తపము ఫలించెనంటే దండ నుండు మోక్షము యెపుడు నిష్పలమంటే యెన్నఁడు లేదు కృప నలమేల్మంగ కధిప శ్రీవేంకటేశ్వర కపటము లిఁక నేల కావవే యిందఱిని రేకు:0143–02 మలహరి సంపుటము: 02-190 పల్లవి: దైవమా నీపెరరేపణ లివి తప్పక వున్నవి జీవులకు భావించి కాదని దొబ్బి దీకొనఁగ బ్రహ్మాదులకైనను వసమా చ. యెక్కడ సిద్ధించు బ్రహ్మచర్యము యెదుటనే కాంతలఁ జూచినవేళను చక్కఁగా మనోవ్యభిచారంబునఁ జలియించుం గాక చిక్కునే విరతి ధనధాన్యంబులు చేతికి లోనయినఁ జూచి వొక్కటియై తా నండే మగ్నమునొందించుం గాక చ. కలుగునే తనివి బహుపదార్ధములు గక్కన నంగళ్లనుఁ జూచి కొలఁదిమీఱఁ గడుతరితీపులతో కోరుచు నోరూరుం గాక వలనుగ సమూ8) Cయోటు వలె దొరకొను వాజవారణంబులఁ జూచి యెలమితోడ ముంగిళ్లనెల్లఁ జరియింపించుఁ గాక చ. యేరీతి నెలకొను నీమీఁదితలఁపు యిహలోకపు సౌఖ్యము చూచి భారపు లంపటములు పై దగిలించి పనులకుఁ బురికొలుపుఁ గాక ధారుణి నే నివి గెలుచుట యెన్నఁడు తగ శ్రీవేంకటనాయక నీవే గారవించి రక్షింపుము నీ కిది కడునుపకారంబౌఁ గాక రేకు: 0101-04 భైరవి సంపుటము: 02-004 పల్లవి: దైవమా నీమాయ తలమొ లెఱఁగనీదు కావరపు విషయాల కట్టు వదలవు చ. గక్కునఁ బెరిగివచ్చీ కాలము మీఁదమీఁద వొక్కనాఁటి కొక్కనాఁటి కొత్తుకొత్తుక నిక్కి తుమ్మిదలవంటి నెరులెల్లాఁ దెల్లనాయ కక్కరమాయ మేను కాంక్షలూ నుడుగవు చ. చిన్ననాఁడు మోహించిన చెలులు నేఁ జూడఁగానే పన్నిన వయసు మీరి ప్రాడలైరి వన్నెకుఁ బెట్టిన సామ్మ వడి రాసి యెత్తుదీసె మున్నిటివే వెనకాయ ముచ్చటాఁ దొలఁగదు చ. సిగ్గులెల్లాఁ బెడఁబాసె చేరి యవ్వరు నవ్వినా యెగుపట్టదు మనసు యెఱుకతోనే