పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

630 వినోదమాత్రాలు వేడుకలెల్లా యెనలేని శ్రీవేంకటేశ నీమహిమ లివి వెనకా ముందరా విన్నవించ నేమున్నది రేకు:0084-03 సాళంగనాట సంపుటము: 01-407 పల్లవి: దైవమా నీకు వెలితా తలఁపు వెలితేకాక వేవేలుకర్మాల వేసారఁగ వలసె చ. హరి యంటే బాపేటి అన్ని పాపాలు సేసిన పొరి నందుపై నమ్మిక పుట్టదుగాక నరసింహ యంటే వచ్చే నానాపుణ్యాలకు తిరముగా ఋణములు దీర్చుకొనఁగలవా చ. దేవ జగన్నాథ యంటే తెగనిజన్మము లేవి కైవశము నామనసు గాదుగాక గోవింద యనియంటేఁ గూడని పదవు లేవి కావిరిఁ గాల మూరకె గడుపేము నేము చ. వేదనారాయణమంటే వీడేటిబంధములు ఆదిగా మూఁడులోకాలనైనా నున్నదా శ్రీదేవిపతి యైన శ్రీవేంకటేశ్వరుఁడా యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక రేకు: 0342-04 శుద్ధవంతం సంపుటము: 04-247 పల్లవి: దైవమా నీచేఁతలు తప్పదు మా రోఁతలు యేవలఁ జూచిన బాయ దేమందమయ్యా చ. కాయములో హేయమదే కమ్మఁబూఁత మీఁద నదె రోయదు చిత్తమునకు రుచియే తోఁచీ మాయలనే పారలేది మాఁటలనే విసిగేది యేయోడఁగనీ గాన మేమందమయ్యా చ. పుట్టుగది యెంగిలి పూఁచిన దాచారము గుట్టు చెడదందునాను గుణమే తోఁచీ వట్టియాసఁ బొరలేది వంతఁ బడి తిరిగేది యెట్టు వేగించఁగవచ్చునేమందమయ్యా చ. నిక్కిచూచితే నెరుక నిద్దిరించితే మరపు మక్కళించినబదుకు మంచిదై తోఁచీ మిక్కిలి శ్రీవేంకటేశ మీకు నేను శరణంటే యొక్కువాయ నాపదవి యేమందమయ్యా రేకు:0244-02 వరాళి సంపుటము: 03-249 పల్లవి: దైవమా నీచేతిదే మాధర్మపుణ్యము పూవువంటి కడు లేఁతబుద్ధివారము చ. యేమిటివారము నేము యిదివో మాకర్మ మెంత భూమి నీవు పుట్టించఁగఁ బుట్టితిమి నేమముతో నడచేటి నేరుపేది మావల్ల దీముతో మోచిన తోలుదేహులము చ. యొక్కడ మాకిఁక గతి యెరిఁగే దెన్నఁడు నేము చిక్కినట్టి నీ చేతిలో జీవులము తక్కక నీ మాయలెల్లఁ దాఁటఁగలమా మేము మొక్కలపుటజ్ఞానపు ముగ్ధలము చ. యేది తుద మొదలు మాకిఁక నిందులో నీవే