పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

629 పామరుని నన్నింత పాలించితి యేమని కొనియాడుదు యే నిన్ను శ్రీవేంకటేశ ఆమంచి నీ దాసులలో ఆరుహమా నేను పె.అ.రేకు : 0031–03 దేశాక్షి సంపుటము: 15-173 పల్లవి: దైవమా నిన్ను దూర దగవు గాదు నా భావములో నున్నాఁడ వీ పరిపాటి చాలదా చ. పుట్టించిన దైవమవు పూరి మేపేవా నెట్టన నిహము తొల్లే నీ సంకల్పమూ పట్టులేక నా మనసు పరువులు వెట్టి నిన్ను గట్టిగాఁ గొలువని నా కర్మ మింతే కాక చ. యిచ్చితివి దేహము యింద్రియములఁ బూంచితి నిచ్చలు నా బ్రదు కెల్ల నీ సూత్రము యిచ్చ నా స్వతంత్రమంటా యిందు నందుఁ బొరలుచు కచ్చి నిన్నుఁ దలఁచని కల్ల యింతే కాక చ. ముందరిజన్మ మానె మున్నిటిపాపము దీరె సందడి నీ దాసులకు శరణనఁగా అంది శ్రీ వేంకటేశ్వర ఆచార్యుననుమతి కందువ దెలిసె పుణ్యకర్మ మింతే కాక రేకు:0250-01 సామవరాళి సంపుటము: 03-284 పల్లవి: దైవమా నీ వెలితేది తమ వెలితేకాని జీవుల(లు?) పట్టిన కొల్ల చేతిలోనే వున్నది చ. నిండినవి జగముల నీ నామము లనంతము లండఁ దలఁచేవార భాగ్యమే కాని పండియున్నదిదే దేవభక్తి యెందు చూచినాను దండితోడఁబనిగొనే తమ నేర్పేకాని చ. మనసులలో నున్నది మరి నీపై జ్ఞానము వొనరఁ దెలిసేవారి వోపి కేకాని ఘనమైన మున్నిటి నీ కథలెల్లా నున్నవి విన నేరిచినవారి వివేకమే కాని చ. శ్రీవేంకటేశ మీ ముద్ర చెల్లుబడై వున్నది వేవేగ ధరించేవారి వేడుకే కాని తావుకొని చేరువ నీదాస్యమిట్టే వున్నది భావించి నమ్మేటివారి పని యింతే కాని రేకు:0164-05 శ్రీరాగం సంపుటము:02-310 పల్లవి: దైవమా నీ వొక్కఁడవే దక్కిన ధనము గాక యీవలానావలా మఱి యెంచ నేమున్నది చ. పుట్టినవారికెల్లా పొత్తుల దీజగము మెట్టికూచుండే యరఁగు మేదినియల్లా బట్టబయటి భోగాలు బంతికూటిబోజనాలు పట్టి తమపని యేరుపరచ నేమున్నది చ. పంచుకొన్నభాగాలు పంచమహాభూతాలు పంచేంద్రియములే పరివారాలు యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి తెంచి యొచ్చుకుందు లిందుఁ దెలుప నేమున్నది చ. మనోవికారాలు మానుషపు టెఱుకలు