పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

628 భావపుటారంభంబులు బాలలీలగతులు కైవశమందఁగ శ్రీవేంకటపతి నీదాస్యం బిది మావంటివారికెల్లను నీమన్ననలాలనలు రేకు: 03:16–06 రామక్రియ సంపుటము: 04-095 పల్లవి: దైవము నీవే దయదలఁచుట గా కావలఁ బ్రాణికి యూసే దయ్యా చ. ఆస వొకటి యెంతయినాఁ దనియదు వాసి యొకటి తనవంతులు మానదు యూసా6కటి శాంత్రమెరఁగని దిదె మోసపుదేహికి ముక్తి యే దయ్యా చ. పాపమొకటి భవబంధముఁ బాపదు దీపమొక్కటి ధీరత యొల్లదు చూపారిక టింబ్రియసుఖముల గెలువదు యేపునఁ బ్రాణికి యెఱకే దయ్యో చ. పాయమొకటి చాపలములు మానదు కాయమొకటి తనకర్మము విడువదు యీయెడ శ్రీవేంకటేశ్వర నీసేవ సేయని యాత్మకు సెలవే దయ్యా రేకు:0206–02 దేవగాంధారి సంపుటము: 03-032 పల్లవి: దైవము నీవే యిఁక దరి చేరుతువుఁ గాక జీవుల వసము గాదు చిక్కిరి లో లోననే చ. పుట్టుట సహజ మిది పొదలే జీవుల కెల్ల గట్టిగా జగమునOదు కలకాలము నట్టేటి వరదవలె నానాటి నీ మాయ కొట్టుక పారఁగఁజొచ్చె కూడిన విజ్ఞానము చ. పాపమే సహజము బద్ధసంసారుల కెల్ల కాఁపురపు విధులలో కలకాలము తేపలేని సముద్రము తెరఁగున కర్మమెల్లా మాపురేపు ముంచంజొచ్చె మతిలోని ధైర్యము చ. లంపటమే సహజము లలి దేహధారులకు గంపమోపుకోలికెల కలకాలము యింపుల శ్రీవేంకటేశ ఇదె నీ దాసులని పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి పె.అ.రేకు:0008-01 బౌళి సంపుటము: 15-044 పల్లవి: దైవమా నన్నిందులోతగు మానిసిఁగాఁ జేసి యీవల రక్షించే మేలు యిది చాలదా చ. అవ్వలఁ దిరిపెములై అంగలార్చే జీవులలో యెవ్వరిఁ బోలుదు నే నెంచి చూచితే రవ్వగాఁ గ్రిమికీటాలై రమియించే జంతువులలో యొవ్విధి నే సరి గాక యెంతవాఁడ నేను చ. పాపము సేసి నరకబాధలఁ బడే వారిలో యేపున నన్నుఁ జూచితే యే నేమి బాఁతి పై పైన జ్ఞానపు పశుపక్షిమృగాలలో తోపునూకుడే కాక దొరనా నేను చ. యేమిటివాఁడనై నిన్ను ఇంకా నేఁ గొసరుదు