పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

627 భారపు వికారాలఁ బాసినవాఁడీ యాత్మ ఆరయ శ్రీవేంకటేశు నాధీన మీతఁడని సారము దెలియుటే సత్యం జ్ఞానము రేకు:0276-04 శంకరాభరణం సంపుటము: 03-439 పల్లవి: దైవంబవు కర్తవు నీవే హరి యీవల నావల నెవ్వఁడనయ్యా చ. తలఁచిన తలఁపులు దైవయోగములు కలిగిన చేఁతలు కర్మములు వెలసిన దేహము విషయాధీనము యిలనెఁ గాదన నెవ్వఁడనయ్యా చ. జిగి నింద్రియములు చిత్తపు మూలము తగులవి) (ము?) మూయకుఁ దనుగుణము జగతిఁ బ్రాణములు సంసారబంధము యొగదిగ నాడఁగ నెవ్వఁడనయ్యా చ. శ్రీతరుణీశ్వర శ్రీవేంకటపతి ఆతుమ యిది నీయథీనము యీతల నీవిఁక ನಿಫ್ಟಿನಿ జేయుము యే తలపోఁతకు నెవ్వఁడనయ్యా రేకు:0013-03 కన్నడగౌళ సంపుటము: 01-079 పల్లవి: దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట కావలసిన సౌఖ్యంబులు గలుగ కమానీనా చ. ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు యొక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినది యొక్కడిమోహవిడంబన యొక్కడియాశాబద్ధము యొక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా చ. యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలు యీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనా యీకాయం బస్థిరమనకీదుర్దశలకు లోనై యీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా చ. దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తము పావనమై దురితంబులఁ బాయక మానీనా ఆవిభుకరుణారసమున నతఁడే తను మన్నించిన ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా రేకు:0090-05 గుజ్జరి సంపుటము:01-445 పల్లవి: దైవము నీవే గతి మాతప్పులు పనిలేదు శ్రీవల్లభుడవు నీవే చేకొని కావఁగదే చ. జనని నీమాయా జనకుఁడవు నీవు జనులము నేమిందర మొకసంతతిబిడ్డలము వొనరెడి దినభోగములు వూరేటిచనుబాలు మునుకొను మానడవళ్లివి ముద్దులు మీ కివివో చ. ధర బశుపక్షిమృగాదులు తగ తోఁబుట్టుగులు వురుటగు మాదేహంబులు వుయ్యలతొట్టెలలు మరిగినసంసారము బొమ్మరిండ్లయాట లివి నిరతి మాయజ్ఞానంబు నీకు నవ్వులయ్యా చ. చావులుఁ బుట్టుగు లాడెడిసరి దాగిలిముచ్చిములు