పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

626 మనసే తానగు దైవము మరచిరి యుందరును అనయము తిరువేంకటపతి యాత్మఁదలఁచి సుఖింపుచు ఘనమగు పరమానందము కలుగుట లెన్నఁడొకో రేకు:0239-02 మలహరి సంపుటము: 03-223 పల్లవి: దేహము సమ్మంధము యివి దేహికిఁ బనిలేదు వూహించ నేర్చినవారలే వోరుచుకుందురయ్యా చ. విడువవు శీతోష్ణంబులు విడువవు సుఖదుఃఖంబులు వెడవెడ మరణభయంబులు విడిచినయందా (కా వుడుగవు కాంక్షలు మమతలు నుద్యోగంబులు చింతలు పొడవగు విరక్తి తనలోఁ బొడమినయందాఁకా చ. మానదు చిత్తవికారము మానదు దుర్గణదోషము మానదు భోగము లన్నియు మానినయందాఁకా పోనీదు సేసిన దురితము పోనీదు వ్రాఁతఫలంబును పూనిన తన యజ్ఞానము పాశీయునయుందా (కా చ. తెగవటు భవబంధంబులు తెగ వెడయని గర్వంబులు నిగిడిన యీ యీత్మజ్ఞానము నీవిచ్చినయందాఁకా జగదేకవిభుఁడ శ్రీవేంకటేశ్వర సర్వము నీయానతికొలఁదే తగులుచుండు నివి నిశ్చలముగ నీదాస్యము గలిగినయందాఁకా రేకు: 0304-06 వరాళి సంపుటము:04-024 పల్లవి: దేహముతోడిది లంకె తీరదిది హరిమాయ సాహసపు జీవులకు సహజమెప్పుడును చ. నెట్టనఁ బెక్కిండ్లవిందు నిండుకొన్నయాఁకలి వొట్టి నిచ్చకల్యాణి కామోద్రేకము కట్టినవోడదూలము కాయపుసంసారము దట్టమైన ప్రాణులకుఁ దనివేడదయ్యా చ. పొదొకటై రూపము పొదలేటి యీవయసు తిద్దుబడి గుఱ్ఱము హత్తినగుణము వొద్దనుండినట్టి నీడ వుడివోనియట్టి నిద్ర అద్దుకొని వుండుఁగాక అదియేల మానును చ. పచ్చిగరికెకాలము ప్రపంచములో బ్రదుకు తచ్చి చూచెటి సూత్రము తన జ్ఞానము అచ్చపు శ్రీవేంకటేశుఁ డాత్మలో నిధానము యిచ్చ నెరుఁగుకొంటేనే యిహమే పరము రేకు: 0183-05 బౌళి సంపుటము:02-419 పల్లవి: దేహి నిత్యుఁడు దేహము లనిత్యాలు యివాహల నా మనసా యిది మరవకుమీ చ. గుదిఁ బాతబీర మాని కొత్తచీరగట్టినట్టు ముదిమేను మాని దేహి మొగిఁ గొత్తమేను మోచు అదనఁ జంపఁగ లేవు ఆయుధము లీతనిఁ గదిసి యగ్నియు నీరు గాలియుఁ జంపఁగలేవు చ. యీతఁడు నరకువడఁ డీతఁ డగ్నిఁ గాలఁడు యీతఁడు నీట మునుఁగఁ డీఁతఁడు గాలిఁబోఁడు చేతనుఁడై సర్వగతుండౌ చెలియించఁ డేమిటను యూత్రల ననాది యూతఁ డిరవు గదలఁడు చ. చేరి కానరానివాఁడు చింతించరానివాఁడు