పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

625 పూవుల నిన్నుఁ బూజింతు పొంచి వెలిని శ్రీవేంకటేశ నీ సేవలోని మరఁగింతే యీవల రెంట దెప్పర మిదివో మాబదుకు రేకు:0089-01 మలహరి సంపుటము: 01-435 పల్లవి: దేహ యీతగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నవమయ్యా చ. తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యొక్కడికిఁ బోవునయా పెనఁగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యొక్కడి కేఁగుదురయ్యా చ. పారెదుగుచు మనమున బొరెడమినయూసలు అదన నెక్కడికి నరుగునయా వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా చ. లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని యందునయా బలు శ్రీవేంకటపతి నాయాత్మనుఁ గలిగితి వెక్కడి కలుషములయ్యా రేకు:0176-04 బౌళి సంపుటము:02-378 పల్లవి: దేహంబొకటే దేహియు నొకఁడే దాహంబెంతటఁ దనియునో తలఁపు చ. వినుకలి వెంట వెడలీఁ దలఁపు కనుకలి వెంటఁ గదలీఁ దలఁపు కొననాలుక మదిఁ గూడీఁ దలఁపు తునిగిన యెన్నెన్ని తునకలో తలఁపు చ. నయమగు చోటను నవ్వీఁ దలఁపు భయమగు చోటను బడలీఁ దలఁపు లయమై నిద్రల లవమయోఁ దలఁపు క్రియ నెందలి పంగెనయో తలఁపు చ. భావించిన గతిఁ బాలీఁ దలఁపు వేవేలు గతుల వెలసీఁ దలఁపు శ్రీవేంకటపతి చిత్తము లోపల నీవే తెలుపఁగ నినుఁగనె తలఁపు రేకు:0022-06 శ్రీరాగం సంపుటము: 01-136 పల్లవి: దేహము దానస్థిరమట దేహి చిరంతనుఁడౌనట దేహపు మోహపు నేఁతలు తీరుట లెన్నఁడొకో చ. కన్నులఁబుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధల కన్నులు మనసునుఁ దనియక గాసిఁబడిరి జనులు తన్నిఁక నెరుఁగుట లెన్నఁడు తలఁపులు దొలఁగుట లెన్నఁడు తిన్నని పరవశములచేఁ దిరుగుట లెన్నఁడొకో చ. సిగ్గులు దొలఁగనియాశలఁ జిక్కికదా దుర్మానపు సిగ్గుల యెగులచేతను చిక్కువడిరి జనులు సిగ్గులు దొలఁగుట యెన్నఁడు చిత్తము లోనౌటెన్నఁడు తగుల మొగుల నేఁతలు తలఁగుట లెన్నఁడొకో చ. మనసు బుట్టిన యాతఁడు మనసునఁ బెనగొని తిరుగఁగ