పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

624 చేకొను పుణ్యములే నీ జీవభావము యేకడను శ్రీవేంకటేశుఁడే నీ వునికి దీకొని నీ తీర్ధమాడితిమి కావవమ్మా పె.అ.రేకు : 0034-01 భూపాళంసంపుటము: 15-189 పల్లవి: దేవునిపస్తాదము తెరళ లందుకోరో యీ వేళ నారగించె యీశ్వరేశ్వరుఁడు చ. వేగు జామునను లేచి వేద విప్ర లెల్లఁ గూడి ఆగపు ధనుర్మాసమందు పూజించి రాగమునఁ దేర్పాముడి రంతుసేసి చదువఁగ జాగుతోడ నారగించె సర్వలోకేశ్వరుఁడు చ. దిన సంభ్రమములతో దేవదుందుభులు మైూయ తన చెరపులు పై పై దాసులు సేయ సనకాదు లిరువంక సంకీర్తన వాడఁగా వినుకొంటా నారగించె విశ్వలోకేశ్వరుఁడు చ. హత్తుకొని వైష్ణువులు అనుష్టానములు దీర్చి యెత్తిచేతుల పుష్పాంజ లియ్యఁగాను పొత్తుల నలమేలుమంగ బోనము దొడుకఁగాను చిత్తగించి ఆరగించె శ్రీ వేంకటేశ్వరుఁడూ రేకు: 0357-05 లలిత సంపుటము:04-337 పల్లవి: దేవునిమరవకు మంతే మాట చిత్తమా దీవెనై కలఁడు మాకు దేవుఁడు చ. అరుదగుజీవుని బ్రహ్మాండరోళములోన తెరఁగై పుట్టించువాఁడు దేవుఁడు అరసి కమ్మరవచ్చి యన్నపానాదులు వెట్టి తిరుగ రక్షించువాఁడు దేవుఁడు చ. బలుసంసారములోన భ్రమసియుండిన మాకుఁ దెలిపి చెప్పినవాఁడు దేవుఁడు తెలియనికర్మములు తెగనిబంధాలు వాపి తిలకించి కాచువాఁడు దేవుఁడు చ. తల్లియుఁ దండ్రియునై దాతయై కలఁడు మాకు తెల్లమి శ్రీవేంకటాద్రిదేవుఁడు మల్లాడి తనదాసులమతిలోఁ దా నుదయించి తెల్లవారించేవాఁడు దేవుఁడు రేకు:0138-04 గుండక్రియ సంపుటము: 02-163 పల్లవి: దేహ మిది యొకటే దేవుఁడ నీవొకఁడవే యీహల రెంట దెప్పర మిదివో మాబదుకు చ. రాతి రొక్కలోకము రవ్వపడెఁ గలలోన ఘాతలఁ బగలొక్కలోకము వేగితే యీతల రెప్పలే మరఁగిందుకు నందుకుఁ జూడ యేతుల రెంట దెప్పర మిదివో మాబదుకు చ. సతి కాఁగిలొకటే జవ్వనపుఁగాఁక రేఁచు సుత కాఁగిలొక వేరేసుఖమై తోఁచు మతిలోని మరఁగింతే మగువలే యిద్దరును ఇతవై రెంట దెప్పర మిదివో మాబదుకు చ. దైవమా నిన్నాతుమలోఁ దలఁచి యానందింతు