పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

623 పరముగలవానికి బ్రాంతులు లేవు యిరవై శ్రీవేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు అరయ దాసులము మా కడ్డాఁకే లేదు రేకు: 0152–02 మంగళకౌశిక సంపుటము: 02-241 పల్లవి: దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి యీవలావల చూచినా నిఁకలేదు తెఱఁగు చ. కోపము మానితేనే కోటిజపాలు సేయుట పాపము సేయకుంటేనే బలుతపము లోపల తానూరకుంటే లోకమెల్లాఁ జరించుట మాపుదాఁకా వెదకినా మఱిలేదు తెఱఁగు చ. పరకాంత నంటకుంటె బలుపుణ్యాలు సేయుట సారిది నాసమానుటే సాణిమపానము సరిమోనాన నుండుటే సన్యాసము చేకొనుట యిరవైతే నంతకంటే నిఁకలేదు తెఱఁగు చ. పలు సుఖదుఃఖములఁ బాసి వుండుటే మోక్షము అల చంచలము మూనుటది యూగము యిలపై శ్రీవేంకటేశుఁడిచ్చిన సుజ్ఞానమిది యెలమి బుద్ధిఁ బోల నిఁకలేదు తెఱఁగు రేకు: 0326-04 ధన్నాసి సంపుటము:04-151 పల్లవి: దేవుదేవుఁడితడే దివ్యమూరితి యేవలఁ జూచినఁ దానే యీరూపై వున్నాఁడు చ. వేంకటాచలము మీఁది విశ్వరూప విశేషము అంకెల ననంతావతారాలైన విశేషము లంకె సింగారాది సర్వాలంకార విశేషము యింకని మహిమలతో నీరూపై వున్నాఁడు చ. అందరిలో నంతర్యామియెన విశేషము కందర్పుఁబుట్టించిన ఘన విశేషము ముందు జగముసృష్టించి మూలమైన విశేషము యిందరితోఁ గూడుకొని యివారూపై వున్నాఁడు చ. పరము యోగీంద్రులెల్ల భావించిన విశేషము అరుదైన వేదవేదాంతార్థ విశేషము పరగ నలమేల్మంగపతియై శ్రీవేంకటేశుఁడిరవై దాసులఁ గావ నీరూపై వున్నాఁడు రేకు:0185-01 గుండక్రియ సంపుటము: 02-426 పల్లవి: దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా చ. ధర్మార్థకామ మోక్షతతులు నీ సోబనాలు అర్మిలి నాలుగు వేదాలడె నీ దరులు నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు కూర్మము నీలోఁతు వో కోనేరమ్మా చ. తగిన గంగాది తీర్ధములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జలజంతులు గగనపుఁ బుణ్యలోకాలు నీదరి మేడలు మొగి నీ చుట్టు మాఁకులు మునులోయమ్మా చ. వైకుంఠనగరము వాకిలే నీ యాకారము