పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

622 చ. మాయలఁ బొరలితిమి మరచితి మింతలోనే చాయల శ్రీవేంకటేశు శరణంటిమి రోయఁజొచ్చె జగమెల్లా రుచియాయ వైరాగ్యమాయము నాలోపలి అంతరాత్మేకాని రేకు:0289-04 వరాళి సంపుటము: 03-515 పల్లవి: దేవుఁడవు నీవు జీవులు నీ బంట్లు చేవదేరి నీ సేఁతే శేఖరమై నిలిచె చ. చేరి నేరమి సేసేది జీవునికి స్వభావము నేరిచి రక్షించేది నీ స్వభావము ధారుణి లోపల మరి తప్పలెంచఁ జోటేది మేర మీరి నీ మహిమే మిక్కుటమై నిలిచె చ. మత్తుఁడై వుండేదే మనుజుని స్వభావము నిత్తెపుజాన మిచ్చేది నీ స్వభావము వొత్తి గుణావగుణాలు వొరయఁగఁ జోటేది సత్తుగా నీ కరుణే సతమయి నిలిచె చ. చెలఁగి నీ శరణు చొచ్చేదే నా స్వభావము నెలవై యేలుకొనేది నీ స్వభావము మలసి శ్రీవేంకటేశ మనసు సోదించ నేది చలిమి బలిమిని నీస్వతంత్రమే నిలిచె పె.అ.రేకు:0016-06 లలిత సంపుటము: 15-092 పల్లవి: దేవుఁడు గలఁడుగా దీనికేమి కైవసమయ్యేరుగాక కానీ కానీ చ. పంచేంద్రియములాల పాపపుణ్యకర్మమా చంచల చిత్తమా అరిషడ్వర్గమా యించుకంత జీవుఁడింతై యిందరు దొమ్మిసేసి పంచుకొంటి రింతట మీ పంత మెక్కెనా చ. యిలఁ దాపత్రయమూ యివాషణత్రములాల బలుసంసారము అనుబంధములాల కలిగిన దేహ మిదె కాణాచి మీ రందరు నెలకొంటి లిందేమీ త్రనివిఁ బొందెనా చ. సకలతత్వములాల జన్మకోట్లాలవో ప్రకటపు నిజమాయ భాగ్యఫలమా వొకట శ్రీవేంకటేశు నొద్దికిఁదీసితిరిమీ రకలంకమైన మీ కృతము చెల్లెనా రేకు: 0154-03 శంకరాభరణం సంపుటము: 02-254 పల్లవి: దేవుఁడుగలవారికి దిగులుఁ జింతయు లేదు శ్రీవిభుఁడే అన్నిటా రక్షించుఁ గనక చ. యేలికగల బంటుకు యేవిచారము లేదు వోలి మగఁడుగలాలికి వొప్పమి లేదు పోళిమిఁ దండ్రిగల పుత్రుని కంగద లేదు మేలుగాఁ బండిన భూమికిఁ గరవు లేదు చ. బలముగల రాజుకు భయమేమియు లేదు కలిమిగలవాని కక్కర లేదు యిల నాచారవంతుని కేపాపమును లేదు తలఁపు బుణ్యముగల ఆతనికిఁ జేటు లేదు చ. గురువుగలవానికిఁ గొఱఁత యేమియు లేదు