పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

621 చ. జ్ఞాన మొకటే యజ్ఞానము నొకటే నానామతములు నడచీని ఆనుక శ్రీవేంకటాధిప నీకృప తానే మమ్మిటు తగఁ గాచీని రేకు: 0242-02 బౌళి సంపుటము: 03-240 పల్లవి: దేవా నీవే యిన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి యేవలనైనా నీవేకాక భువి నింతటివారలు యిఁకఁగలరా చ. జనులకు నీవే వొక్కొకచోటను శాస్తార్ధములై కడఁగుదువు తనియక నీవే మరి వారికి బొధకులఁ గొందరినిఁ గల్పింతువు మనసులో నంతలో వొడఁబడికె చేసి మలయుచు నీవే నిలుతువు కనుగొన నీవే సుజ్ఞానమార్గము కైవసముగాఁ దెలుపుదువు చ. కడఁగియప్పటి నివే యజ్ఞాదికర్మఫలములై వుండుదువు తడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు యెడయక నీవే తపోమహిమలై యెదుటనే తార్కాణ లౌదువు వొడలై నీవే యిహపరములకును వొడిగట్టి సాధింపింతువు చ. ఆవేళ నీవే తత్త్వనిర్ణయము నాధారమునై యేర్పరతువు నీవే కమ్మటి ఆచారవిధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అలమేల్మంగకుఁ బతివై శ్రీవేంకటేశ రక్షింతువు జీవుల కంతర్యామివై నీవే శిషులఁ బరిపాలింతువు పె.అ.రేకు:0059-01 బౌళి సంపుటము: 15-334 పల్లవి: దేవుఁ డొక్కఁడే మఱి జీవులు వేరు వావాతఁ దెలిసేది వారి వారి భాగ్యము చ. పొడమినవారికిఁ బోయినవారికి గడియ లొక్కటే వారి గతులు వేరు బడిఁ బుణ్యములు సేయఁ బాపములు సేయఁగ కడఁగి కాల మొక్కటే కర్మములే వేరు చ. కాకములు సంచలించె కలహంసలు దిలిగె ఆకాశ మొక్కటే విహారాలు వేరు మేకొని యెండలు గాయ మించి చీఁకటులు రాయ లోకపు బయ లొక్కటే జోకలే వేరు చ. అట్టే యేలే రాజులకు నడిగేటి దీనులకు పట్టి భూమి యొక్కటే బాగులు వేరు గుట్టున శ్రీవేంకటేశుఁ గొలువఁగఁ దలఁచఁగ నెట్టన దేహ మొక్కటే నేరుపులే వేరు రేకు:0292-03 దేసాక్షి సంపుటము: 03-532 పల్లవి: దేవుఁ డొక్కఁడే మాకు దిక్కుగాని కావ నెవ్వరును లేరు కతలింతే కాని చ. పచ్చివొళ్లు మోచితిమి పాపమెల్లాఁ జేసితిమి హెచ్చిన మీఁదటి సుద్దు లేఁటివో కాని రచ్చలఁబడె మా గుట్టు రమణుల చేఁత బెట్టు అచ్చమై యిందుకుఁ బరిహరమేదో కాని చ. గాలిమూఁటఁ జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి ఆలించి యేమిటివారమయ్యేమో కాని మైల గొంత మనసూ మణుఁగు గొంతానాయ తాలిమి నా విధి యేమి దలఁచీనో కాని