పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

620 చ. కల్పవృషపుటాకులు కాయటా మంచి విడాలూ కల్పించే పారిజాతమె కమ్మఁబూవులు పొల్పఁగ శ్రీ వేంకటాద్రి పురుషోత్తముఁడ భోగి తల్ప కొలువువేళాయెఁ దగ లేవయ్యా రేకు:0116–03 నాట సంపుటము:02-093 పల్లవి: దేవశిఖామణి దివిజులు వొగడఁగ వేవేలు గతులు వెలసీ వాఁడే చ. వీదుల వీదుల వెసC దురగముపై భేదిల బల్లెము బిరబిరం దిప్పచు మోదముతోడుత మోహనమూలితి యే దెసచూచిన నేఁగీ వాఁడే చ. కన్నులు దిప్పచు కర్ణములు గదల సన్నల రాగెకు చెకళింపుచును అన్నిటఁ దేజి యూడఁగ దేవుఁడు తిన్నఁగ వాగేలు దిప్పీ వాఁడే చ. వలగొనఁ బిరుగుచు వాలము విసరుచు నిలిచి గుబ్జ మటు నేర్పులు చూపఁగ బలుశ్రీవేంకటపతి యహోబలపుఁ బొలమున సారెకుఁ బొదలీ వాఁడే రేకు: 0273-01 బౌళి సంపుటము: 03-418 పల్లవి: దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు యీవల నీ బంట నాకు నెదురింక నేది చ. కామధేనువుఁ బిదుకఁగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుఁడవట కామించి నీ బంటనట కమ్మి నిన్నుఁ దలఁచితినేమి మాకుఁ గడమయ్య యిందిరారమణా చ. యెంచఁ గల్పవృక్షమును యిచ్చు సిరులెల్లాను నించి కల్పవృక్షముల నీడల కృష్ణుఁడవట అంచెల నీ బంటనట ఆత్మలో నిన్ను నమ్మితి వంచించఁ గడమ యేది వసుధాధీశ చ. తగ నొక్క చింతామణి తలఁచినట్లఁ జేసు మిగులఁ గౌస్తుభమణి మించిన కృష్ణుఁడవట పగటు శ్రీవేంకటేశ భక్తుఁడ నీకట నేను జగములో గొఱతేది జగదేకవిభుఁడా రేకు:0215–05 సామంతం సంపుటము: 03-089 పల్లవి: దేవా నీమాయ తెలియనలవి గాదు భావభేదముల భ్రమసితిని చ. జననం బొకటే జంతుకుల మొకటే తనువికారములే తగఁ బెక్కు దినములు నివియే త్రివిరి లోకమిదె పనులే వేరయి పరగీని చ. మాఁటలు నొకటే మనసులు నొకటే కోటులసంఖ్యలు గుణము లివి కూటము లిట్లనె గురిఁ గాముఁ డొకఁడె మేటి వలపులకె మేరలే లేవు