పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

619 చ. అనిలజవరద యహల్యా శాప మోచన సనకాది సేవిత చరణాంబుజ ఘనతర శ్రీ వేంకటగిరి నివాస అనుపమోదార విహార గంజలీరా పె.అ.రేకు:0058-05 మంగళకౌశిక సంపుటము: 15-326 పల్లవి: దేవదేవోత్తమ నాకు దిక్కు నీవే యెప్పుడును యేవివరముఁ దెలియ నేమి సేతునయ్యా చ. పాపముడిగినఁ గాని ఫలియించదు పుణ్యము కోపము మానినఁ గాని కూడదు శాంత్రి చాపల మడఁచక నిశ్చల బుద్ధి గలుగదు యేపున నా వసము గా దేమి సేతు నయ్యా చ. ఆస విడిచినఁ గాని యుంకెకు రాదు విరతి రోసినఁ గాని సుజ్ఞానరుచి వుట్టదు వేసాలు దొలఁగించక వివేకా లెల్లా మెచ్చరు యీ సుద్దు లేమియు నేర నేమి సేతు నయ్యా చ. కల్లలాడకున్నఁ గాని కడతేరదు సత్యము వొల్ల నన్నఁ గాని సుఖ మొనఁ గూడదు యిల్లిదె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే యెల్లకాల మీ మేలున కేమి సేతు నయ్యా రేకు: 0354-06 భౌళి సంపుటము: 04–320 పల్లవి: దేవదేవోత్తముని తిరుతేరు దేవతలు గొలువఁగా తిరుతేరు చ. తిరువీధులేగీని తిరుతేరు తిరుపుగొన్నట్లాను తిరుతేరు తెరలించె దనుజులఁ దిరుతేరు తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు చ. ధిక్కిరించీ మోతలఁ దిరుతేరు దిక్కరికుంభా లదరఁ దిరుతేరు తిక్కుముత్తేలకుచ్చుల తిరుతేరు తెక్కులఁబ్రతాపించీఁ దిరుతేరు చ. తీరిచెఁ గలకలెల్లఁ దిరుతేరు ధీర గరుడవాహపుఁ దిరుతేరు చేరి యలమేలుమంగతో శ్రీవేంకటేశ్వరుని - తీరున నెలకొన్నట్టి తిరుతేరు పె.అ.రేకు : 0036-01 భూపాళంసంపుటము: 15-201 పల్లవి: దేవశిఖామణి కామధేను వేకబల నీకు వేవేగ సంధ్యాదివిధుల వేళాయె లేవే చ. మంచి జలధులే మొగమజ్జనీమున కాయితమా కాంచనపు మేరవే గదెపీఁట అOచ తుంబురు నారదు లదే మంగళపాటకులు వుంచానఁ బాడేరు సూర్యుఁడుదయంచె లేవే చ. వుదయరాగపు మేఘ మొగిఁ గుంకుమగంనము చదలపైఁడి మణుఁగు జాంబూనది అదన కాంతల చూపు లనిగొ మంత్రాక్షతలు యెదురు చల్లేరు పొద్దెక్కినదె లేవే