పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

618 చ. తట్టు పుణుఁగు నించుక దండిసొమ్ములెల్లాఁ బెట్టి అట్టెలమేల్మంగ నరుతఁ గట్టి నెట్టన నమ్మినవారి నిధానమై వున్నవాఁడు పట్టపు శ్రీవేంకటాద్రిపతియైన దేవుఁడు రేకు:0288-05 బౌళి సంపుటము: 03-510 పల్లవి: దేవదుందుభులతోడ దివ్యులతోడ యీ వేళ శ్రీహరి తేరు యేఁగీ వీధులను చ. గరుడధ్వజముతోడ కనకపు గుట్టాలతో పరపై యష్టదిక్కుల బండికండ్లతో నిరతితో పట్టుమాలి నిడుపపగ్గాలతోడ యిరవై శ్రీపతి తేరు యేఁగీ వీధులను చ. పచ్చల ప్రతిమలతో పగడపు నొగలతో హెచ్చిన వైడూర్యపు టిరుసులతో కుచ్చుల ముత్యాలతో గుంపుఁ బైఁడికుండలతో యిచ్చల భూధవు తేరు యేఁగీ వీధులను చ. మంచి నీలాల గద్దెతో మణిదర్పణాలతోడ పాణంచిన సింగారాలతో పూదండలతో అంచె శ్రీవేంకటేశుతో నలమేలుమంగతోడ యెంచఁగ దేవుని తేరు యేఁగీ వీధులను రేకు:0083-02 సాళంగనాట సంపుటము: 01-400 పల్లవి: దేవదేవుడెక్కె నదె దివ్వరథము మావంటి వారికెల్ల మనోరథము చ. జగతి బాలులకై జలధులు వేరఁ జేసి పగటునఁ దోలెనడె పైఁడి రథము మిగులఁగఁ గోపగించి మెరయురావణమీఁద తెగి యొక్కి తోలేనదె దేవేంద్రరథము చ. దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకుఁ బక్కన మరలిచెఁ బుష్పక రథము నిక్కి నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె వెక్కసపు రెక్కలతో విష్ణు రథము చ. బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యొక్కె అలయేఁగు బెండ్లికల్యాణ రథము యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి కలకాలమును నేగె ఘనమైన రథము రేకు: 0384-05 పాడి సంపుటము:04-491 పల్లవి: దేవదేవోత్తమ తే నమో నమో రావణదమన శ్రీ రఘురామా చ. రవికులాంబుధిసాము రామ లక్ష్మణాగ్రజ భువి భరత శత్రుఘ్నుపూర్వజ సవనపాలక కౌసల్యానందవర్ధన ధవళాబ్దనయన సీతారమణా చ. దనుజ సంహారక దశరథ నందన జనక భూపాలక జామూత్ర వినమిత సుగ్రీవ విభీషణసమేత మునిజన వినుత సుముఖ సుచరిత్రా