పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

617 చ. తుదయేడ మొదలేడ తొంగి చూచేవారెవ్వరు అదె సంసారానఁ బ్రాణులాడుచున్నారు ఇదె శ్రీవేంకటేశ్వరుఁ డింతలో విచ్చేసి కాచె యెదుట రక్షకుఁడైతే నిట్టుండవలదా రేకు:0351-04 బౌళిరామక్రియ సంపుటము: 04–300 పల్లవి: దేవతలఁగాచిన దేవుం డితఁడు వేవులు ప్రతాపముల వీరరాముఁడితఁడు చ. రావణుఁజంపి పుష్పకరథ మెక్కి సీతతోడ ఠావుగా నయోధ్యను పట్టముగట్టుక వావిరి సుగ్రీవాదివానరకోట్లు గొలువ చేవమీరి పొగడొందు శ్రీరాముఁడితఁడు చ. వసుధ యింతయునేలి వసిష్ణాదులు వొగడ యొసగ నశ్వమేధాలెల్లాఁ జేసి పారిసఁగఁ గుశలవుల పుత్రులగా నటుగాంచి రసికత మించు దశరధరాముఁ డితఁడు చ. అలర రుద్రునెదుటనటు విశ్వరూపు చూపి లలి బ్రహ్మవట్ట మనిలజని కిచ్చి యిల శ్రీవేంకటాద్రినిరవై నిలిచినాఁడు చలము సాధించిన జయరాముఁ డితఁడు రేకు: 0193–05 సాళంగనాట సంపుటము: 02-478 పల్లవి: దేవతలు గెలువరో తెగి దైత్యులు పారరో భావించ నింతటిలో భూభారమెల్ల నణఁగె చ. నేఁడు కృష్ణుఁడు జనించె నేఁడే శ్రీజయంతి నేఁడే రేపల్లెలోన నెలవైనాఁడు వేడుక యశోదకు బిడ్డఁడైనాఁడిదె నేఁడే పోఁడిమి జాతకర్మ మొప్పగనాయ నేఁడు చ. ఇప్పుడిదె గోవుల నిచ్చెను పుత్రోత్సవము ఇప్పుడు తొట్టెల నిడి రింతులెల్లాను చెప్పరాని బాలలీల సేయఁగలదెల్లాఁ జేసి కప్పెను విష్ణుమాయలు గక్కన నేఁడిపుడు చ. ఇదివో వసుదేవుని ఇంటిచెరలెల్లఁ బాసె ఇదివో దేవకితప మిట్టె ఫలించె చెదరక తా నిలిచె శ్రీవేంకటాదిపై నిదె యెద నలమేలుమంగ యొక్కివున్న దిదివో రేకు:0222-06 దేసాళం సంపుటము: 03-125 పల్లవి: దేవదుందుభులతోడ తేటతెల్లమైనాఁడు సేవించరో యిదే వీఁడే సింగారదేవుఁడు చ. బంగారుమేడలలోనఁ బన్నీట మజ్జనమాడి అంగము తడి యొత్తఁగా నదే దేవుఁడు ముంగిటఁ బులుకడిగిన ముత్యమువలె నున్నాఁడు కుంగని రాజసముతో కొండవంటి దేవుఁడు చ. కాంతులు మించిన మాణికపుదోరణముకింద అంతటఁ గప్పరముచాతు కదే దేవుఁడు పొంతల నమృతమే పోగైనట్టున్నవాఁడు సంతతము సంపదల సరిలేని దేవుఁడు