పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

608 చ. కరుణించీవాఁడదిగో కమలాపతి దేవుఁడు సురలు గొలువఁగాను సాగింపుతోడను యిరవై లోకములెల్లా నేలుచున్నాఁ డదిగో హరి శ్రీవేంకటాద్రియహారోబలేశుఁడు రేకు:0201-05 నాట సంపుటము: 03-005 పల్లవి: దాసోహమను బుద్ధిఁ దలచరు దానవులు యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు చ. హరిచక్రము దూషించే యట్టివారే యసురలు అరయం దామే దైవమన్నవారు నసురలే ధర నరకాసురుడు తానె దైవమని చెడె యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు చ. పురుషోత్తముని పూజ పొంతఁ బోరు అసురలు సరవి విష్ణుని జపించనివారు నసురలే హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు చ. సురలును మునులును శుకాది Cయోగులును పరమము శ్రీవేంకటపతి యనుచు శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు రేకు:0018-05 ఆహిరి సంపుటము: 01-111 పల్లవి: దిక్కిందరికినైన దేవుఁడు కడుఁ దెక్కలికాఁడైన దేవుఁడు చ. కొత్తపైండ్లికూతుఁగోరి చూడఁబోయు యెత్తి తేరిమీఁద నిడుకొని నెత్తికన్ను మానినవాని పెండ్లికి దెత్తిగొన్న యట్టి దేవుఁడు చ. గొప్పయునపెద్దకొండమీఁద నుండి దెప్పరమ్ముగా దిగఁబడి కప్పి రెండుదునుకలు గూడినవాని తిప్పఁదీరులాడే దేవుఁడు చ. బెరసి మేనమామ బిడ్డకునై పోయు నిరతఁపు జీరాలు నెరపుచు యిరవైనమాయపుటెద్దులఁ బొరిగోన్నతిరువేంకటగిరి దేవుఁడు రేకు: 0174-02 సాళంగనాట సంపుటము: 02-363 పల్లవి: దిక్కు నీవే జీవులకు దేవసింహమా తెక్కుల గద్దియమీఁది దేవసింహమా చ. సురలెల్లాఁ గొలువఁగ సూర్యచంద్రులకన్నుల తిరమైన మహిమల దేవసింహమా నిరతిఁ బ్రహ్లాదుఁడు నీయెదుట నిలిచితే తెరదీసితి మాయకు దేవసింహమా చ. భుజము లుప్పొంగఁగాను పూఁచిన శంఖుఁజక్రాల త్రిజగముల నేలేటి దేవసింహమా గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటిద్విజమునిసంఘముల దేవసింహమా