పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

607 చ. సతుల మాఁటుననున్నా సరి నెందెందు వోయినా రతి మెట్టక మానఁడు రాకాసులాల యితఁడు శ్రీవేంకటేశుఁ డెదురులేదితనికి గతియని మొక్కరో వో కపటులాల పె.అ.రేకు: 0035-04 దేశాక్షి సంపుటము: 15-198 పల్లవి: దానికిఁగల గుణము తప్ప దెంతయిన పూనిన నిర్విషమే పో హరినామము చ. మాయవిషయపు నంజు మనుజుల నెల్లాను యేయోడ ధర్మాధర్మ మెఱుఁగనీదు కాయపు నిద్రయు ముంచు కన్నులునుఁ దెరపించు బాయట బహులీలలై భ్రమియింపించును చ. యింద్రియభూతశివము యిందరి మేనును సోఁకి మంద్రపు సంసారమున మాలాడిపించు అంద్రించి కామాదులు యంకణాలాడింపించు తంద్ర నహంకారమున తన్నుఁగాన నియ్యఁడు చ. య5°వనపు వెట్టి వట్టి అందరుసతులతోఁడ నవ్వి నవ్వి యూసలను నటింపించు యివ్వల శ్రీ వేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు రవ్వల నాతఁడే మమ్ము రక్షించు నెపుడు రేకు: 0247-02 సామంతం సంపుటము: 03-267 పల్లవి: దాసవర్గముల కెల్లా దరిదాపు మీరె కాన వాసికి నెక్కించరాదా వసుధలో మమ్మును చ. సేనాధిపతి నీవు చేరి విన్నవించరాదా శ్రీనాథునికి నేము సేసే విన్నపము ఆనుక భాష్యకారులు అట్టే మీరుఁ జేయరాదా మానక విన్నపము మా మనవి చనవులు చ. వేయినోళ్ల భోగి నీవు విన్నపము సేయరాదా వేయేసి మా విన్నపాలు విష్ణునికిని ఆయితమై గరుడఁడ అట్టే మీరుఁ జేయరాదా యేయోడ విన్నపము మా కేమి వలసినాను చ. దేవులమ్మ యిందిర మాదిక్కె విన్నవించరాదా శ్రీవేంకటపతికి చిత్తమందను ఆవేళ శేషాచలమ అట్టే మీరుఁ జేయరాదా యీ వేళ మా విన్నపము లీడేరె నిఁకను రేకు: 0384-02 సాళంగనాట సంపుటము: 04-488 పల్లవి: దాసుల పాలిటి నిధానమై వున్నాఁ డదిగో ఆసాబాసా నితఁడే అహోబలేశుఁడు చ. నగె నదె వాఁడిగో నారసింహదేవుఁడు పగదీర హిరణ్యాక్షుఁ బట్టి చించి మృగరూపై గద్దెమీఁద మెఱసీవాఁడదిగో అగవూఁ దగవెఱిఁగి యహోబలేశుఁడు చ. తేరిచూచీ నదిగో దేవాదిదేవుఁడు ఘనోరపు నెత్తురు గోళ్ళ గురియఁగాను నేరుపుతోఁ బేగుల జన్నిదాలవాఁడదిగో ఆరితేరి కొలువున్నాఁ డహాకోబలేశుఁడు