పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

606 చ. యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁగాఁను నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా పె.అ.రేకు:0013–02 మలహరి సంపుటము: 15-069 పల్లవి: దాఁటలేను యీ మాయ దైవమా నేను నీటునఁ జేసేవాఁడవు నీవే నీవే కా చ. యీ మురికిదేహమే కా యెంతకాలమైన నేను వోముకొని భూమిమీఁద నుండఁ గోరేది దోమటి యింద్రియాలే నా తోడునీడై యుండి నన్ను వేమరు బోగించఁ జేసే వేనుబామైనది చ. పొంచి నాకర్మము లేకా పుట్టించి పుట్టించి పంచల నా జన్మములపాలు సేసేది అంచల యీ చిత్తమెకా ఆసలాసలఁ జిక్కి సంచితమై నా కీ పొద్దు చనివరి యైనది చ. చుట్టుకొన్న సంపదేకా సూదియై నానాఁటికి జట్టిగొని లోలోనే చవి సేసేది అట్టే శ్రీ వేంకటేశ అంతరంగాన నీవెకా పట్టు గొమ్మవై యుండఁగ బదికితి నేను రేకు:0250-05 దేసాక్షి సంపుటము: 03-288 పల్లవి: దాఁటలేను యీమాయ దైవమా నేను నీటునఁ జేసేవాఁడవు నీవె నీవెకా చ. యీ మురికి దేహమేకా యెంతగాలమైన నేను వోముకొంటా భువిమీఁద నుండఁగోరేది దోమటినింద్రియాలేకా తోడునీడయై నన్ను వేమరు భోగించఁజేసి వెనుబలమైనవి చ. పొంచిన నా కర్మమేకా పుట్టించి పుట్టించి పంచల సంసారము పాలు సేసేది అంచెల నీ చిత్తమేకా ఆసలాసలనుఁ దిప్పి చంచుల నా కేపొద్దు చనవరియయ్యేది చ. చుట్టుకొన్న సంపదేకా సూటియైన నాఁటికి జట్టిగొని లోలోనే చవి సేసేది అట్టె శ్రీవేంకటేశ అంతరంగాన నీవెకా పట్టుగొమ్మవై యుండఁగ బదికేది నేను రేకు: 0150-01 నాట సంపుటము:02-229 పల్లవి: దానవారితోడి పగ ధరించరాదు మీకు కానుకిచ్చి శరణని కప్పము లియ్యరో చ. భ్రమసి వార్థిఁబడ్డాను పాత్రాళము దూరినాను సమయింపక మానఁడు శత్రులార రమణ భూమిచోచ్చిన బ్రహ్మచే వరముగొన్న తమిఁ జంపక మానఁడు దై తేయులాల చ. రాసి మిన్నులో దాఁగిన రాచమూకలలోనున్న కోసివేసీఁ దల లరి కుమతులాల ఆసఁ బ్రికూటమెక్కినా ఆచక్రవాళమంటినా తోసి సాధించకపోఁడు దుర్మతులాల