పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

603 యీడనె రుత్తవారి మీ రెంతంతసేయరు చ. చావుఁ బుట్టుగు లనెటి సముద్రాలఁ బడఁదోసి జీవులను విసిగించేచిత్తము మీకు శ్రీవెంకటనాథుఁడె చేపట్టి మమ్మేలెఁగాక వేవేగనఁ బేదలచే వెట్టి యెంతగొనరు రేకు:0020–01 ఆహిరి సంపుటము: 01-119 పల్లవి: తోరణములే దోవెల్లా మూరట బూరట ముంచినలత్రల చ. కూరిమిమటములు గోపురంబులును తేరుపడగెలే తెరువెల్లా కోరినపండు గురిసేటితరువులు తోరములైనవెదురుజొంపములు చ. ఆటలుఁ దిరుపులు నOదపుటురువులు పాటలు వనవైభవమెల్లా కూటువ నెమళ్ళ కోవిల గుంపుల పేటలఁ దేటలపెనుఁగూటములు చ. విOజామరలును విసనకల్దలును గొంజెగొడుగిలే కొండెల్లా అంజనగిరిరాయఁడు వేంకటపతి సంజీవని పరుషల కొదవఁగను రేకు:0151-02 గుజ్జరి సంపుటము:02-236 పల్లవిత్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును వొకటి కోటిగుణితంబగు మార్గములుండఁగ బ్రయాసపడనేలా చ. తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి కనకబిందు యమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ దినకరసామగ్రహణకాలముల తీర్థాచరణలు సేసిన ఫలములు తనుఁ దానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగఁగ మఱి యేలా చ. హరియను రెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమునఁ జదివిన పుణ్యములు పరమ తపాశీయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకగనేలా చ. మొదల శ్రీవేంకటపతికినిఁ జేయెత్తి మొక్కిన మాత్రములోపలనే పదిలపు షాశీడశదానయూగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాగంబులుగాఁ జేసినవాఁడే కాఁడా పలుమారు మదిమదినుండే కాయక్షేశము మాఁటికి మాఁటికి దనకేలా రేకు:0290-06 గౌళ సంపుటము: 03-523 పల్లవి: త్రిజగముల నెరుఁగు దేవదేవుఁడు అజుని జనకుఁడైన ఆదినారాయణుఁడు చ. గరుడని మీఁదనెక్కి ఘనచక్రము చేఁబట్టి పరమపదాన నుండి పరతైంచి మురిపేన కరిఁ గాచి మొసలిఁ దుంచినవాఁడు అరుదైన ప్రతాపపు ఆదినారాయణుఁడు చ. కనకాంబరము గట్టి కౌస్తుభము మెడఁ బెట్టి వెనువెంట శ్రీసతి సేవించుచుండఁగా పనివూని జయముతో పాంచజన్యము వట్టి