పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

604 అనిశముఁ గరుణించీ నాదినారాయణుఁడు చ. త్రిదశులు నుతియించ దిక్కులెల్లా నుల్లసిల్ల ముదమున దాసులెల్లా మొక్కఁగాను వదల కెల్లవారికి వరములిచ్చీవాఁడే అదె శ్రీవేంకటవిభుఁ డాదినారాయణుఁడు రేకు:0063-02 శ్రీరాగం సంపుటము: 01-323 పల్లవి: త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా చ. వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీసతీశ సరసిజనేత్రా భూసురవల్లభ పురుషోత్తమ పీతకౌశేయవసన జగన్నాథా చ. బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధినిహార కుంజరవరద సులభ సుభద్రాసుముఖ సురేస్వర కలిదోషహరణ జగన్నాథా చ. వటపత్రశయన భువనపాలన జంతు ఘటకారకరణ శృంగారాధిపా పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా రేకు: 9050-01 శ్రీరాగం సంపుటము: 04-564 పల్లవి: త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథా చ. వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర భూసురవల్లభ పురుషోత్తమ పీత కౌశేయవసన జగన్నాథా చ. బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలి దోష హరణ జగన్నాథా చ. వటపత్ర శయన భువనపాలన జంతు ఘటకార కరుణ శృంగారాధిప పటుతర నిత్య వైభవ రాయ తిరువేం కటగిరినిలయ జగన్నాథా రేకు: 9069-01 కన్నడగౌళసంపుటము: 04-573 పల్లవి: త్వమేవ శరణం త్వామేవ మే భ్రమణం ప్రసరతి ఫణీంద్రశయన చ. కదావా తవ కరుణా మే సదా దైన్యం సంభవతి చిదానందం శిథిలయత్రి మదాచరణO మధుమథన చ. మయూ వా త్రవ మధురగతి భయూదిక విభ్రాంతోహం తయా విమలం దాతవ్యా దయా సతతం ధరణీరమణ