పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

602 వంది పెక్కుబొంకుల నాయందుఁ గూటమెంతో చ. శ్రీవేంకటేశ్వర శ్రీసతీమనోహర సేవ నీదాసులే నిన్ను చేతఁ జూపేరు మోవ నొక్క శునకము మొర యాలించితివట వేవేలు జన్మాలెత్తితి యీవిధ మెట్టాలించేవో రేకు: 0324-03 ధన్నాసి సంపుటము: 04-138 పల్లవి: తొల్లిటివారు వెట్టినతోవ యిది బల్లిదులై యిందునే బదుకు టే మేలు చ. కలఁడు సర్వేశ్వరుఁడొక్కఁడు దిక్కందరికిని సులభుఁడు శరణము చొచ్చితేఁ గాచు నతఁడు బలుతపములు చేసి పాట్లఁ బడ నోప మని బలువుఁడాతని నమ్మి బ్రదుకు టే మేలు చ. వున్నాఁడు మనసులోనే వొక్కచో వెదకవద్దు ఇన్నిటాఁ దలఁచుకొంటే నిచ్చు నిహముఁ బరము కన్నచోట్ల వెదకి కడు నలయనోపము పన్నుగ నితనిఁ గొల్చి బ్రదుకు టే మేలు చ. శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిలుచున్నవాఁడు సేవించిన యంతలోనే చేకొని యేలు నీతఁడు దేవతలఁ బ్రార్ధించి తెలియఁగ నేరము భావించితని నుతించి బ్రదుకు టే మేలు రేకు: 9004-01 ఆహిరి సంపుటము: 04-532 పల్లవి: తొల్లియును మట్టాకు తొట్టెలనె యూఁగెఁగన చెల్లుబడినూఁగీని శ్రీరంగశిశువు చ. కలికి కావేరి తరగల బాహులతలనే తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల పలుమారుఁదనునూ(చి పాడఁగానూఁగీని చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు చ. అదివోరి కమలజుని త్రిరువారాధనOబనఁగ అదనఁ గమలభవాండమనుతొట్టెల ఉదధులు తరంగములనూ(చఁగా మాఁగీని చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు చ. వేదములె చేరులై వెలయంగ శేషుఁడే పాదుకొను తొట్టెలై పరగఁగాను శ్రీ దేవితో(గూడి శ్రీ వేంకటేశుఁడై సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు చి.ఆ.రేకు:0009-05 సామంతం సంపుటము: 10-053 పల్లవి: తోటకూరదోంగలాల తొయ్యలులాల నాఁటకపు మీమోహము నమ్మ నెట్టవచ్చును చ. పాపపుణ్యపు టోఁదాలపాలు సేసి జీవులను చూపలనె భ్రమయించే సుద్దులు మీవి దాపుదండై శ్రీవిభుఁడు తానె కాచెఁగాక యేపున రిత్తవారి మీ రెంతంత సేయరు చ. కీడు మే లనె వురులఁ గీలించి మనుజులఁ బాడితోనె యెంచెటిభావము మీది యీడేరించి నాగురుఁడు యిందిరేశుఁ జూపెఁగాక