పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

601 పలు చంచల వికారభావ విూ గుణము చ. ముందు దాఁగలిగితే మూఁడు లోకములుఁ గల వెందుఁ దా లేకుంటే నేమియును లేదు అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె కందువల నితనిసంకల్ప విూపనులు రేకు:0176-06 బౌళి సంపుటము:02-380 పల్లవి: తొల్లి యెట్టుండునో తాను తుద నెట్టుండునో తాను యిల్లిదె నట్టనడుమ నింతేసి మెరసీ చ. పుట్టినప్పుడే దేహి బుదులేమీ నెఱఁగఁడు యిట్టె లోకులఁ జూచి యింత నేరిచె ముట్టుకొన్న యింద్రియాల ముదిసి ముదిసి రాఁగా తట్టువడి తనమేను తానే మరచె చ. మనుజుఁడైనప్పుడే తా మాటలేమి నెరఁగఁడు జనులాడుకొనఁగానె సంగడి నేర్చె దినదినభోగాల దృష్టాంతములెల్ల అనుభవనై(???) తన కడియాలమాయ చ. తచ్చి తాఁ గలప్పుడే దైవము నెఱఁగఁడు నిచ్చ నాచార్యునివల్ల నేఁ డెఱిఁగె అచ్చపు శ్రీవేంకటేశుఁ డంతర్యామై యుండి యిచ్చఁ గరుణించఁగాను యొక్కుడాయఁ దాను రేకు: 0341-02 లలిత సంపుటము:04-239 పల్లవి: తొల్లి యేరుపరచిరి దొడ్డవాఁడు హరియని యెల్లసందేహాలు బాసె నిఁకనేల చింత చ. నారదుఁడు సాదించి నారాయణు నెలిఁగె సారెకు శివుఁ డెరిఁగి చాటె రాముని చేరి సోదించెఁ బార్వతి శ్రీరామచంద్రుని యేరీతుల సాదించేము యింతకంటె నేము చ. వేదవ్యాసులు దెలిసే వెదకి విష్ణునిఁ జెప్పె సాదించిత్రని యోగిసనకాదులు యీదెస శుకాదులెల్ల నెరిఁగిరి మాధవుని కాదని వీరికంటె గత్రి గానఁగలమా చ. పెక్కుగాలము చదివి పెక్కేండ్లుబదికి పెక్కు రుషులిందుననె పెద్దలైరి దక్కఁగ శ్రీవేంకటేశు ధనముగాఁ జూపి రిదె తక్కక కొలిచితిమి దైవమని కంటిమి రేకు:0285–02 ముఖారి సంపుటము: 03-489 పల్లవి: తొల్లిటివారికంటే దొడ్డ నేను పాతకాన బల్లిదుఁడ వగుటకుఁ బ్రతాపమిదివో చ. నరహరి యచ్యుత వో నారాయణా గురుఁడు నిన్నుఁ గొండించెఁ (?) గోల నే వింటి గరిమ నొక్కతప్పున కాకికిఁ బరమిచ్చితి సిరులఁ బెక్కుతప్పులు సేసితి నేమిచ్చేవే చ. మందరధరుఁడ వో మధుసూదనా అందరు నిన్నొకమాcట ఆడఁగా వింటి నింద కొకటి బొంకితే నీవు ధర్మజుఁ గూడితి