పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

600 సహస్రారదివ్యచక్రాయుధా చ. అనంతచరణ సర్వాధారాధేయ అనంతకరదివ్యాయుధా అనంతనిజకల్యాణగుణార్ణవ అనంత శ్రీవేంకటాద్రినివాసా రేకు:0045-04 సామంతం సంపుటము: 01-276 పల్లవి: తొక్కనిచోట్లు దొక్కెడిమనసు యొక్కడ గతిలే దింకనో తెరువు చ. పాపము వాయుదు పై పై మనసున కోపము దీరదు కొంతైనా దీపన బాధయుఁ దీర దిన్నియును యేపునఁ బెనఁగొనె నింకనో తెరువు చ. యెవ్వనమదమును నెడయదు కోరికె కొవ్వును నణఁగదు కొంతైనా రవ్వగు మమకారముఁ బెడఁబాయదు యొవ్విధియును లేదింకవో తెరువు చ. వెఱపును విడువదు వెడమాయలఁబడి కొఱఁతయుఁ దీరదు కొంతైనా తెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి - నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు రేకు:0028–01 సాళంగం సంపుటము: 01-169 పల్లవి: తొలుఁబాపపుణ్యాలతోడఁబుట్టితినట బలువైనభవములఁ బడలేనా చ. గాముల యింటనే కాఁపనయితినట పాముపుట్ట నుండియైన బతుకలేనా గోమున హేయపుఁగుండకూడు నించితినట గామిడి నేగారేతిత్తిఁగా నోపనా చ. కట్టెనగుణములచే కట్టువడితినట చుట్టపుబంధాలరొచ్చుకు నోపనా దట్టపుటాసల నేఁదాల్చితినట నావెట్టకాయము మోపవెఱచేనా చ. నిగిడినలోపల నీ వుండుదుట పగవారికి నేఁ బగిలేనా తగువేంకటేశ నీదయవాఁడనట యివావగల నిన్నిఁట గెలువఁగలేనా రేకు: 0313-01 పాడి సంపుటము:04-073 పల్లవి: తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే కల్లయునుఁగాదు ఇది కడు నిజము గాదు చ. కనుదెరచినంతనే కలుగు నీ జగము కనుమూసినంతనే కడుశూన్యమౌను కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును త్రన మనోభావనలఁ దగిలి తోఁచీని చ. తలఁచినంతనె యెంతదవ్వయినఁ గాన్పించు తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు