పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

592 నాఁట నిట్ల హరినామము నొడివిన గాఁటపువరములు కలుగునె కాదా చ. చేసినపుణ్యము చేతఁజుట్టుకొని రాసి వెనుతగిలి రక్షించు వేసర కిటు శ్రీవేంకటేశ్వరుని ఆసల కైంకర్యము ఫలించును రేకు:0088-04 సామంతం సంపుటము: 01-432 పల్లవి: తెలియక వూరక తిరిగేము చలమలి కగునా సంతతసుఖము చ. హేయము కడుపున నిడుకొని యింకా 'చీ' యనని మాకు సిగ్గేది పాయము పిడికిటఁ బట్టుచునుండేటి కాయధారులకుఁ గలదా విరత్రి చ. అంగనల రతుల యాసలనీఁదేటి యెంగిలిమనుజుల కెర్గేది ముంగిట నారురుముచ్చులఁ గూడిన దొంగగురుని కిందుల నిజమేది చ. జననమరణములు సరి గని కానని మనుజాధమునకు మహిమేది యెనగొని శ్రీవేంకటేశు శరణ మిటు గని మనకుండిన గతి యిఁక నేది పె.అ.రేకు:0072-03 శ్రీరాగం సంపుటము: 15-413 పల్లవి: తెలియదు నీ మనసు దేవోత్తమా సులభుండవని విని చొరఁబారీ మనసు చ. చూతును నీ మూరితిని చొప్పుగాఁ గన్నులెదుట ఆతుమలోఁ దలపోనే ననుచును అలవరచుకొందును నీతి యెంచి చూచితేను నీ వెంతనే నెంత యీతల నా యగ్గలికెకు నే మనుచున్నాఁడవో చ. నెట్టుకొనఁ బూజింతు నీవు నా వాఁడవేయంటా పెట్టెలోన నుంచి చక్కఁ బెట్టుకొందును యెట్టిది నా సాహసంబు యేమిటి నిన్ను మెప్పించితి నట్టనడుమ నన్నెట్టు నవ్వుతా వున్నాఁడవో చ. నొడిగి నిన్నుఁ బిలుతు నోరునిండాఁ బేరుకొని యొడయ కెందున్నాఁడవొ యొక్కడెక్కడ అడరి శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి వడి నన్నేలితి వెటువంటి సుకృతివో రేకు: 0355-04 గుండక్రియ సంపుటము: 04-324 పల్లవి: తెలియనివారికిఁ దెరమరుఁగు తెలిసినవాలికి దిష్టంబిదియే చ. కన్నులయెదుటనుఁ గాంచినజగ మిది పన్నిన ప్రకృతియు బ్రహ్మమునే యిన్నిట నుండఁగ నిదిగాదని హరిఁ గన్న చోట వెదకఁగఁబోనేలా చ. అగపడి యిరువదియొుదై జీవునిఁ దగిలినవెల్లాఁ దత్వములే