పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

591 దేవుం డితనినమ్మిన తీరుఁబో దుఃఖములు రేకు:0235-06 లలిత సంపుటము: 03-203 పల్లవి: తెగక పరమునకుఁ దెరువులేదు పగయెల్లా విడువక భవమూఁ బోదు చ. కన్నుల యెదుటనున్న కాంచనముపై మమత వున్నంతదడవు మోక్ష మొనగూడదు అన్నముతోడి రుచుల యలమట గలదాఁకా పన్నిన సుజ్ఞానము పదిలము గాదు చ. పక్కనున్న కాంతల భ్రమగల కాలము మిక్కిలి శ్రీహరిభక్తి మెరయలేదు వెక్కసపు సంసారవిధి నున్నంతదడవు నిక్కి పరమధర్మము నిలుకడ గాదు చ. చిత్తము లోపలి పలుచింతలు మానినదాఁకా సత్తుగా వైరాగ్యము సమకూడదు యిత్తల శ్రీవేంకటేశుఁ డేలిన దాసులకైతే హత్తి వైకుంఠపదవి అప్పుడే కలదు రేకు:0003–05 గుండక్రియ సంపుటము: 01-018 పల్లవి: తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద వెలుఁగులోపలికి వెలుఁగేలా చ. అరయ నాపన్నుని కభయ మీ వలెఁగాక ఇరవైనసుఖం గావనేలా వఱతఁబోయెడివాని వడిఁ దీయవలెఁగాక దరివానిఁ దివియంగఁ దానేలా చ. ఘనకర్మారంభునికట్లు విడవలెఁగాక యెసి మునక్తునిఁ గావనేలా అనయము దుర్బలుని కన్నమిడవలెఁగాక తనసినవానికిఁ దానేలా చ. మితిలేనిపాపకర్మికిఁ దా వలెఁగాక హితవెఱుఁగుపుణ్యుని కేలా ధృతి హీనుఁ గృప జూచి తిరువేంకటేశ్వరుఁడు తతిఁ గావకుండినఁ దానేలా రేకు:0352-01 భూపాళం సంపుటము: 04-303 పల్లవి: తెలియఁడుగాక బ్రిష్టము జీవుఁడు సులభమిదివో యిచ్చోటనే పరము చ. మనసునఁ దలచిన మర్మములు గరఁగి చొనుపుచు నింద్రియసుఖ మిచ్చు అనువుగ నిటువలె హరిఁదలపాకిసిన తనకు బ్రహ్మానందము సమకొనదా చ. మాటలాడినను మరిగి మానవులు యీటున మెచ్చిత్తురేమైనను