పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

588 మందమైన జడునికి మఱఁగులై తోఁచును చ. ధరఁగొందరు మూరులు తగ నొక్కరాజుఁ గొల్చి పరిచారకునిఁ దిట్టి భంగపడ్డట్టు యిరవుగ శ్రీ వేంకటేశుఁ గొల్చి వారివారి విరసాలాడుచుఁ దామె విఫలులై పోదురు చి.ఆ.రేకు:0007-03 లలిత సంపుటము: 10-039 పల్లవి: తాళపాకన్నమాచార్య దైవమవు నీవు మాకు వేళమె శ్రీహరిఁ గనేవెర వానతిచ్చితివి చ. గురుఁడవు నీవెసుమ్మీ కుమతి నై ననాకు సరవి బ్రహ్మోపదేశము సేసితి పరమబంధుఁడ వైనా పరికింప నీవెసుమ్మీ వరుస నేఁ జెడకుండ వహించుకొంటివి చ. తల్లివైన నీవెసుమ్మీ తగిన విషయాలలో పల్లదానఁ బడకుండా బ్రదికించితి అల్లుకొని తోడునీడవైనా నీవెసుమ్మీ చిల్లరమాయలలోనఁ జెడకుండాఁ జేసితి చ. దాతవు నీవెసుమ్మీ తగు శ్రీవెంకటనాథు నాతలఁపులో నిలిపి నమ్మఁ జేసితి యేతలఁ జూచినా నాకు నేడుగడయు నీవె ఆతల నీతల నన్ను నాడుకొని కాచితి రేకు: 0309-04 సామంతం సంపుటము: 04-052 పల్లవి: తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము చ. నిండినట్టి మడుగుల నీరువంక పొలము కొరెండలు మోఁచినపెద్ద గొబ్బరపుఁబొలము అండనే పొలము రాజులుండేటి పొలము చెండివేసి మాకులెల్లా సెలగినపాలము చ. అసపడి వరదానమడిగిన పారెలము బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము రాసికెక్కేమునులకు రచ్చెన పొలము వేసరక నాగేట వేగిలైన పొలము చ. మంచి గురుతైన రావిమానిచేని పొలము వంచిన గుఱ్ఱముఁదోలే వయ్యాళి పొలము యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైన పొలము పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము రేకు: 0190-04 దేసాళం సంపుటము:02-459 పల్లవి: తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత బిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ చ. సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకలవినోదరాయ వర వసంత్రములరాయ వనితల విటరాయు గురుతైన తేగరాయకొండల కోనేటిరాయ చ. గొల్లెతల వుద్దండరాయ గోపాలకృష్ణరాయ చలు వెదజాణరాయ చల్లఁ బరిమళరాయ చెల్లుబడి దర్మరాయ చెప్పరాని వలరాయ