పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

589 కొల్లలైన భోగరాయకొండల కోనేటిరాయ చ. సామసంగీతరాయ సర్వమోహనరాయ ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ కామించి నిన్నుఁ గోరితే గరుణించితివి నన్ను శ్రీమంతుఁడ నీకు జయ శ్రీవేంకటరాయ రేకు:0222-03 సాళంగనాట సంపుటము: 03-122 పల్లవి: తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట హరి వాఁడె పెండ్లికొడుకై ప్రతాపమున చ. కనకపుఁ గొండ వంటి ఘనమైన రథముపై దనుజమర్దనుఁడెక్కెదరుణులతో వినువీధిఁ బడెగె(డగ?)లు వేవేలు కుచ్పులతోడఁ బెనగొనఁగఁ గదలె భేరులు మైూయఁగను చ. వరుసఁ జంద్రసూర్యులవంటి బండికండ్లతోడ గరుడధ్వజుఁ డొరసిఁ గడుదిక్కులు పరగు వేదరాసులే పగ్గాలు వట్టితియ్యఁగ సరుగ దుషులఁ గొట్టి జయము చేకొనెను చ. ఆటలుఁ బాటలు వింటా నలమేల్మంగయుఁ దాను యీటున శ్రీవేంకటేశుఁ డెదురులేక వాటపు సింగారముతో వాకిటవచ్చి నిలిచీ కోటానఁగోటి వరాలు కొమ్మని ఇచ్చుచును రేకు:0006-04 బౌళి సంపుటము: 01-039 పల్లవి: తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని ఆపదలచేతఁ బొరలాడేముగాక చ. అప్పుదీరినదాఁకా నలవోకకైనవా రెప్పుడునుఁ దమవార లేలౌదురు అప్పటప్పటికిఁ బ్రియ మనుభంపుచు మమత చెప్పినటువలెఁ దాము సేయవలెఁ గాక చ. పొందైనవారమని పొద్దు వోకకుఁ దిరుగు యిందరునుఁ దమవార లేలౌదురు కందువగు తమకార్యగతులు దీరినదాఁక సందడింపుచుఁ బ్రియము జరపవలెఁ గాక చ. తెగని కర్మము దమ్ముఁ దిప్పకొని తిరిగాడ ఆగడుకోరిచి పెక్కులాడ నేమిటికి తగవేంకటేశ్వరునిఁ దలఁచి యిన్నిటాఁ దాము విగతభయులయి భ్రాంతి విడువవలెC గాక రేకు:0280-01 సాళంగనాట సంపుటము: 03-459 పల్లవి: తీరుచు నతఁడే దినకర్మంబది నూలిటి రుణ మొుక నూలిపాశీఁగునా చ. తొల్లిటి కర్మము దోడఁగుడుచుటకె తెల్లమి జీవుఁడు దేహము మోచుట వొల్లనన్నఁ బోదున్నంత గాలము మల్లాడి హరినే మఱవఁగ వలదు చ. కోరిన కోర్కికి గురియగు నందుకె సారపు సంసారసంగమిది నేరిచి బ్రదికేటి నెపమునఁ బోదది