పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

583 ద్వయాధికారముఁ దగిలినవాఁడ చ. జ్ఞానము లేదు మోనము లేదు పూని శ్రీవేంకట పురుషుఁడిదె నానాటఁ దెలిపి నను మన్నించెను సానఁదేరి తన శరణమువాఁడ రేకు: 9049-01 కాంబోది సంపుటము: 04-562 పల్లవి: తల్లిఁ బాసి బిడ్డలెల్లఁ దల్లడించినట్టు నా పల్లదా లెవ్వరి పాలయిన్యానో తాము చ. మేదరింటి లంజవోయి మేదినీశుఁ దగులఁగ గోదిలి కువిటులెల్లఁగుల్లినయట్టు ఆదిగొని నేఁబోయి హరిఁ గొలువఁగ నా గాదిలి కర్మములేడఁ గంటివో తాము చ. కాఁపుటూరి మంగలోజు గడిమీఁది రాజుగాఁగ కాపులెల్లాఁ బనిమాసి కందినయట్టు ఆఁపలేక నేఁబోయి హరిఁ గొలువఁగ నా పాపము లెవ్వరి పంచపాలయిన్యానో తాము చ. ఒట్టిన మోపులు మోవనోపక వూరువిడిచి వెట్టివాఁడు పారిపోఁగా వెదకినట్టు ఇట్టె నేను శ్రీవేంకటేశుఁ గొలువఁగ నా చుట్టము లిందరు నేడఁ జొచ్చేరో తాము పె.అ.రేకు:0017-06 గుండక్రియ సంపుటము: 15-098 పల్లవి: తల్లికిఁ గలుగు ముద్దు దాది కున్నదా చిల్లరప్రియము లేలో చెప్పేముగాకా చ. బహు విశ్వకుటుంబవి ప్రాణులెల్ల నీ వారు యిహ మిచ్చి రక్షింప నీ కిదే పని నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపచేవా బహు విన్నపాలూరకే పైపైఁ జేసీఁ గాకా చ. సర్వవిధ బంధుఁడవు సకల కృత్యాలు నీవి నిర్వహించ నన్నిటాను నీ కిదే పని వుర్విపై నీకార్యములు వుద్దరించక మానేవా చర్వితచర్వణాల వేసరించేము గాకా చ. నీవు లోకేశ్వరుఁడవు నేమెల్లా నీ బంట్లము యీవలఁ గాచుటకు నీ కిదే పని శ్రీవేంకటేశ మీ పెట్టుఁ జెట్ల దయఁ జూడవా దైవమవు విన్నూరకే తలఁ బంచేఁగాకా రేకు:0352-02 వసంతం సంపుటము: 04-304 పల్లవి: తల్లియాపె కృష్ణునికిఁ దండ్రి యీతఁడు చల్లఁగా లోకములెల్లా సంతోసమందెను చ. అరుదై శ్రావణబహుళాష్టమినాటిరాత్రి తిరువవతారమందెను కృష్ణుఁడు యిరవై దేవకిదేవి యెత్తేకొని వసుదేవు - కరములందుఁ బెట్టితే కడుసంతోసించెను చ. తక్కక యమునానది దాఁటతఁడు రేపల్లెలో పక్కన యశోదాదేవిపక్కఁ బెట్టెను యొక్కువనాపె కృష్ణునినెత్తుక నందగోపుని