పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

584 గక్కన వినిపంచితే కడుసంతోసించెను చ. మరిగి పెద్దె కృష్ణుఁడు మధురలోఁ గంసుఁజంపి బెరసి యలమేల్మంగఁ బెండ్లాడి తిరమై శ్రీవేంకటాద్రిని దేవకీదేవియు ఇరవై తే వసుదేవుఁ డేఁచి సంతోసించెను రేకు: 0335-04 దేసాళం సంపుటము:04-205 పల్లవి: తల్లియుఁ దండ్రియు మరి దైవము నాతఁడే కాక యెల్ల జీవులకు మరి యెవ్వరింక దిక్కు చ. యీ సంసారమునకు యితఁడె దిక్కు నేఁ జేసేటిచేఁతలకెల్ల శ్రీపతే లోను పాసిపోఁడెప్పుడు నన్ను బందువుఁడితఁడే నాకు దాసుఁడైనవాఁడు హరిఁ దగదు దూరఁగను చ. చావుఁబుట్టుగులవేళ సతము నీతఁడే సావి భోగములకు నిచ్చకుఁడీతఁడే భావములోపల నుండుప్రాణ మీతఁడే నాకు దైవము దూరగనేల తనకేమి వచ్చినా చ. తలఁపులోపలికి యీదైవమే తోడు యిలఁ గలిమిలేములు కీతఁడే తోడు పలుకులోపల నుండుభాగ్య మీతఁడె నాకు కొలిచి శ్రీవేంకటేశుఁ గొసరంగనేఁటికి రేకు:0086-01 లలిత సంపుటము: 01-417 పల్లవి: తహతహ లిన్నిటికి తానే మూలము గాన సహజాన నూరకున్న సంతతము సుఖము చ. భారమైన పదివేలు పనులు గడించుకొంటే సారెసారె నలయించకపోవు తీరనియూసాదము దేహములో నించుకొంటే వూరూరఁ దిప్పితిప్పి వొరయక మానవు చ. వుండివుండి కిందుమీఁదు వుపమఁ జింతించుకొంటే వుండుఁబో మంచముకింద నొకనూయి కొండంతదొరతనము కోరి మీఁద వేసుకొంటే నండనే యూబహురూప మాడకపోదు చ. మనసురానివైన మంచివి చేసుకొంటే తినఁదిన వేమైన దీపవును తనిసి శ్రీవేంకటేశు దాసానదాసుఁడైతే యెనయుచు నేపని కెదురే లేదు రేకు:0281-04 సాళంగనాట సంపుటము: 03-468 పల్లవి: తానెంత బ్రదుకెంత దైవమా నీమాయ యెంత మానవుల లంపటాలు మరి చెప్పఁగలదా చ. చెలఁగి నేలఁ బారేటి చీమ సయుతమును కలసి వూరకే పారుఁ గమ్మర నెందో మరలు తలమోఁచి కాపురము ధాన్యములు గూడపెట్టు యిల సంసారము దనకిఁక నెంతగలదో చ. యేడో బాయిటఁ బారే యీఁగ సంుతమును వాడుదేర నడవుల వాలి వాలి కూడపెట్టు దేనెలు గొందులఁ బిల్లలఁ బెట్టు