పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

581 అగణిత మోక్షమునందుఁ బొందుట చ. మహి ఇంతా హరిమయముగఁ గనుటే విహితపు జ్ఞానము వెసఁ గనుట ఇహమున శ్రీవేంకటేశు శరణనుటే సహజపు జన్మము సఫలం బనుట రేకు:0068-05 వసంతం సంపుటము: 01-356 పల్లవి: తలఁపులోపలి తలఁపు దైవమితఁడు పలుమారుఁ బదియునుఁ బదియైన తలఁపు చ. సవతైనచదువులు సరుగఁ దెచ్చిన తలఁపు రవళిఁ దరిగుబ్బలివి రంజిల్లు తలఁపు కవగూడఁ గోలి భూకాంత్రముంగిట తలఁపు త్రివిలి దూషకు గోళ్ళఁ దెగటార్చు తలఁపు చ. గొడగువట్టినవానిఁగోరియడిగిన తలఁపు తడఁబడక విప్టులకు దానమిడు తలఁపు వొడిసి జలనిధినిఁ గడగూర్చితెచ్చినతలఁపు జడియక హలాయుధము జళిపించు తలఁపు చ. వలపించి పురసతులవ్రతము చెలిచిన తలఁపు కలికితనములు చూపఁగలిగున్న తలఁపు యిల వేంకటాద్రిపై నిరవుకొన్న తలఁపు కలుషహరమై మోక్షగతిచూపు తలఁపు రేకు:0135-03 లలిత సంపుటము: 02-144 పల్లవి: తలగరో లోకులు తడవకరో మమ్ము కలిగినదిది మా కాఁపురము చ. నరహరికీర్తన నానిన జిహ్వ వొరుల నుతింపఁగ నోపదు జిహ్వ మురహరు పదములు మొక్కిన శిరము పరుల వందనకుఁ బరగదు శిరము చ. శ్రీపతినే పూజించిన కరములు చోఁపి యూచనకుఁ జొరవు కరములు యేపున హరికడ కేఁగిన కాళ్ళు పాపుల యిండ్లకుఁ బారవు కాళ్ళు చ. శ్రీవేంకటపతిఁ జింతించు మనసు దావతి నితరముఁ దలCచదు మనసు దేవుడతని యూధీనపు తనువు తేవల నితరాధీనము గాదు రేకు: 0356-06 గుండక్రియ సంపుటము: 04-332 పల్లవి: తలపోఁత చిత్తమునఁదరిగానక బుద్ధి గలఁగెఁ గావనో మమ్ముఁ గర్మమా చ. పాపజాతిమేనితోడఁబడ్డపాటే చాలదా ఆపదలకేల లోనాయ నిప్పుడు దీపమైనహరిభక్తి దెలిసియుంతటనైనఁ గాపాడి పరమీవో కర్మమా చ. చెప్పరానిసుఖములు చెప్పి చెప్పి కని కని చప్పుడుగా లోకమునఁ జాటి చాటి దెప్పరపుభవములఁ దిప్పదీరైతి మిదె