పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

580 కొలఁది వెట్టఁగరానిగోళ్ళు నిడుపాయ చ. చిరభోగసౌఖ్యములఁ జెంద ననుభవిగాన తిరువేంకటాచలాధీశ్వరుండాయ పరగ సంసారసంపదకు బదుఁడు గాన అరుదుగా సకలాంతరాత్మకుండాయ రేకు:0187-02 గుండక్రియ సంపుటము: 02-439 పల్లవి: తలఁపులో కొట్టగొన దైవమే వున్నాఁడు తలఁచిన రూపులెల్లా తా నయిన్యానయ్యా చ. కలలో ప్రపంచము కంటి నే నొకటి వెలినున్న ప్రపంచవిధివలెనే కలనున్నవాఁడ నేనే వెలి నన్నువాఁడ నేనే తెలి(య?) మాబతుకు రెంట దెప్పరములయ్యా చ. దేహమీఁడ నుండఁగానే దిక్కులకేఁగీ మనసు దేహముతో దిక్కులెల్లాఁ దిరిగినట్టే దేహములోవాఁడ నేనే దేహముపై వాఁడ నేనే వోహో మాజన్మములో నొకటి రెండయ్యా చ. కన్నులెదుట శ్రీవేంకటపతిఁ గొలిచెద కన్నుమూసి యూతనినే కమ్మర భావించెదను కన్నులోపల నేనే కన్నులవెలిని నేనే వున్నతి నీరెండును వొక్కటాయనయ్యా పె.అ.రేకు : 0036–06 శంకరాభరణం సంపుటము: 15-206 పల్లవి: తలఁపులోననే దైవము వీఁడిగో సులభము సులభము సాధించరో చ. యిదే హరినామము యిదే కొననాలికె వదలక తలఁచితే వైకుంఠము వెదకంగ నేఁటికి వెడపుణ్యము లింక సదరము సదరము సాధించరో చ. కలదు దేహమిదె కలవివె ముద్రలు వలెనని చేకొన్న వైకుంఠము వొలసి కర్మములఁ బొరలఁగ నేఁటికి కలిగెను కలిగెను కైకొనరో చ. శ్రీ వేంకట మదె శ్రీపతి వీఁడిగో వావిరిఁ గొలిచిన వైకుంఠము భావించి చూచిన బ్రహ్మాదులకును త్రోవయిదె త్రోవయిదె తొలఁగకురో రేకు: 0316-02 లలిత సంపుటము:04-091 పల్లవి: తలఁపులోని వెలితే దైవము వెలితె కలగిన ఇదియే కారణము చ. యెదిటి యాసలకు నెడిసి తొలఁగుటే తుద నరకములకుఁ దొరెలఁగుట వదలక ఇంద్రియవర్గము గెలుచుటే పదపడి తనపాపముల గెలుచుట చ. మగటిమి సంసారమాయ దాఁటుటే త్రగుభవవాలి) దాఁటుట జగములోపలను శాంతిగలుగుటే