పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

579 బెగడుట దురితము పెడఁబాయు కొరకే చ. యీవలఁ జేయుట ఆవలి కొరకే ఆవలనుండుట యీవలం కొరకే యీవలనావల నెనయం దిరుగుటెల్ల శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే ජීජo: 0152-03 సౌరాష్ట్రం సంపుటము: 02-242 పల్లవి: తలఁచుకో వో మనస తగిన ద్రిష్టము లివి వెలలేక తెచ్చేటి వివేకము లోధనము చ. గాలిఁబోయేఁ మాటలు లోకములోని సుద్దులెల్లా గాలిఁ బో వెన్నఁడును శ్రీకాంతునుతులు జాలిఁబడే సేఁతలుసంసారభోగములెల్లా జాలిలేనివి విష్ణుని సంతతపుపూజలు చ. మాయమనౌ గొన్నాళ్లకు మానుషకృత్యములెల్లా మాయముగానివి దైవికమహిమలెల్లా కాయకములే తమ కల్పితము లన్నియును కాయకము గాక నిల్పుఁ గమలాక్షు మన్నన చ. వుడివోవు రాఁగారాఁగా నున్నతకర్మఫలాలు వుడివోదు దేవునిపై నొనరు భక్తి జడియ నితరులిచ్చేసకల వరములును జడియదు శ్రీవేంకటేశ్వరుఁడిచ్చే వరము రేకు:0061-01 ఛాయనాట సంపుటము: 01-310 పల్లవి: తలఁప వెనక నుయ్యి తగరు ముందట దీనఁ దొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమిసేతు చ. మమకార విముక్తి మార్గదూరము నీపై మమతసేయక నాకు మనరాదు మమత మేలో నిర్మమత మేలో దీనిక్రమమున క్రమము నేఁ గాన నేమి సేతు చ. కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని ష్కర్మము పాతకమునకుఁ దొడవు కర్మిగావలెనో నిష్కర్మి గావలెనో యీమర్మంపు మదము మాన దేమిసేతు చ. శరణాగత రక్షకుడవైనయట్టి తిరువేంకటగిరిదేవుఁడా పరిపూర్ణఁడవో నీవు పరిచ్ఛిన్నుఁడవో నిన్నరసి భజింపలేనైతి నేమిసేతు రేకు:0017-05 వరాళి సంపుటము: 01-105 పల్లవి: తలఁపు కామాతురత్వముమీఁదనలవడిన నిల నెట్టివారైన నేలాగు గారు చ. ఓలినిరువురుసతుల నాలింగనము సేయ లోలుఁడటుగాన నాలుగుచేతులాయ వేలసంఖ్యలు సతుల వేడుకల రమియింపఁ బాలుపడెఁగాన రూపములు పెక్కాయ చ. పొలయలుకకూటముల భోగి దా నటుగాన మలసి యొక్కొకవేళ మారుమొగమాయ లలితలావణ్యలీలావిగ్రహముగాని