పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

578 తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు చ. చటులార్డున సఖుఁడు జాతరూప వరుఁడు ఇటమీఁద బ్రహ్మ పట్ట మేలేటి వాఁడు నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుఁడు పటు కలశాపుర ప్రాంత హనుమంతుఁడు పె.అ.రేకు:0041-04 శంకరాభరణం సంపుటము: 15-234 పల్లవి: తలఁచి చూడ పరతత్త్యం బితఁడు వలసినవారికి వరదుఁ డితఁడు చ. సిరికి మగఁ డమృతసింధువునకు నలుఁడు సరుస పార్వతికి సయుదోడు గరిమెల బ్రహ్మకుఁ గన్నతండ్రి యితఁడు పరగి శివునకు బావ యితఁడు చ. అల దేవేంద్రుని యనుజుఁడితఁడు ములసి చంద్రుని మఱఁ దితఁడు కులమున నదితికి కొడుకూ నిత్రcడు త్రలఁపు సురాసురలత్రాత్రయు నిత్రCడు చ. ప్రాణుల కెల్లా బంధుఁ డితఁడు వాణికి మామగు వావి యితఁడు జాణ శ్రీవేంకటాచలరమణుఁ డితఁడు మాణికపు మన్మథుఁ డితఁడు రేకు:0225-03 దేసాక్షి సంపుటము: 03-140 పల్లవి: తలఁచినప్పుడు వచ్చు దయ యొప్పుడూఁ దలంచు కలసిన బంధువుడు కమలారమణుఁడే చ. ఆతుమలోననే వుండు అన్నిటాఁ బాయనివాఁడు యీతల నాతలఁ దానే యేమైనా నిచ్చు చేతిలోఁ జేసే కర్మాలు చెడనియ్యఁడెన్నఁడును ఆతుర బంధువుఁడు హరి యొక్కఁడే చ. నిచ్చలు విందులు వెట్టు నెలఁతల నొడఁగూర్చు యిచ్చెరిఁగి కప్ప గోకలెందైనాఁ దెచ్చు మెచ్చునేమిటికినైనా యిచ్చినవి గైకొను ముచ్చటైన బంధువుఁడు ముకుందుఁడే చ. తోడునీడై వచ్చు మరి దొరతనము సేయించు పాడితోఁ బంచేంద్రియాలఁ బంపు సేయించు మేడెపు సంసారములో మించిన నిద్ర దెలుపు వేడుక బంధువుఁడు శ్రీవేంకటేశుఁడే రేకు:0011-04 దేవగాంధారి సంపుటము: 01-070 పల్లవి: తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ దెలియుట దనలోఁ దెలియుట కొరకే చ. ఉదయమందుట భవముడుగుట కొరకే చదువుట మేలువిచారించు కొరకే బ్రదుకుట పురుషార్ధపరుఁడౌట కొంరక్రే యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే చ. తగులుట విడివడఁదలఁచుట కొరకే నొగులుట కర్మమునుభవించు కొరకే చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే