పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

57.7 వెక్కసమే కాక యెంచ వీరిలోనే వొకఁడా చ. అందరు నీతనియందే అయిచతే నౌదురుఁ గాక యెందును శ్రీపతి తోడియివాడువారా కందువ శ్రీవేంకటాద్రి ఘనవరము లొసఁగె దిందుపడ్డ లోకులకు ద్రిష్టమిదే కాదా రేకు: 0362-06 కన్నడగౌళ సంపుటము: 04-368 పల్లవి: తల లేదు తోఁక లేదు దైవమా నమాయలకు తెలిసియుఁ దెలియక తిరిగేము నేము చ. త్రను వేఁటిదో యూ త్రలపాశీఁత్ర లేఁటివో యెనయు సంసార సుఖ మిది యేఁటిదో వెనక ముం దేఁటిదో వివేక మెరఁగక దినదినమును నేమో తిరిగేము నేము చ. పుట్టు గిది యొక్కడో పోయేటి దెక్కడో ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో మట్టులేని హరి నిర్మాణ చక్రములోన దిట్టలమై యేమేమో తిరిగేము నేము చ. నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో వూరకే నీ దాసులమై వున్నారము చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర గారవించి కరుణించి కావఁగదవే చి.ఆ.రేకు:0003-06 మలహరి సంపుటము: 10-018 పల్లవి: తలఁ పెన్నఁడు నినుఁ దగులునయ్యా చల మెన్నఁడు కడచనునోయయ్యా చ. మోహం బెన్నఁడు ముదుసునయ్యా దాహం బెన్నఁడు తలఁగునయ్యా సాహస మెన్నఁడు జరగునయ్యా శ్రీహరి తెలియఁగ జెప్పఁగదయ్యా చ. కపటం బెన్నఁడు గడచునయ్యా చపలత లెన్నఁడు జారునయ్యా నిపుణత లెన్నఁడు నెగడునయ్యా ప్రపంచముగ హరి పలుకఁగదయ్యా చ. మచ్చర మెన్నడు మానునయ్యా నిచ్చల మెన్నఁడు నిలుచునోయయ్యా గచ్చుల శ్రీవెంకటనాథ పచ్చిదేర హరి పలుకఁగదయ్యా రేకు: 0383-02 గౌళ సంపుటము: 04-483 పల్లవి: తలఁచరో జనులు యీతని పుణ్య నామములు సులభముననే సర్వశుభములు గలుగు చ. పూనుమOతుడు వాయుజ3C డOజనా తనయుఁడు వనధి లంఘన శీల వైభవుఁడు దనుజాంతకుఁడు సంజీవనీ శైల సాధకుఁడు ఘనుఁడు కలశాపుర హనుమంతుఁడు చ. లంకా సాధకుఁడు లక్ష్మణ ప్రబోధకుఁడు శంకలేని సుగ్రీవ సచివుఁడు పొంకపు రాముని బంటు భూమిజసంతోష దూత