పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

576 వుంకించి రావణుఁ జంప నోపఁడా వాయుజుఁడు చ. శ్రీవేంకటేశుఁడైన శ్రీరాఘవుని పంపున వావిరి నంగదముఖ్యవానరులెల్లా ఆవేళ హేమపాత్ర లగ్నిలో వేసినవారు రావణునందులో వేసి రా నోపరా పె.శ్రీ.అ.రేకు: 8009-05 సామంతంసంపుటము: 15-461 పల్లవి: తరి నిధానము గన్నదాఁకా దరిద్రంబు స్థిరముగా కివి గనిన సిరు లేమి బ్రాఁతి చ. మొదల గోవింద యను మూడక్షరంబులును పదిలముగ నోరఁ బనుపడు దాఁకానె కదియుఁగా కాపదలు కలుషములు జీవులకు చెదరుగా కివి గనిన సిరు లేమి బ్రాత్రి చ. నారాయణా యనెడి నాలుగక్షరములు పేరుకొని నోరి కచ్చిన దాఁకానె భూరిదుఃఖములు నలపులు సదా జీవులకు చేరినా యవి గనిన సిరు లేమి బ్రాతి చ. వేంకటేశ్వర యనెడి వేదపంచాక్షరము అంకురంబయి నోరి కవుదాఁకానె జంకెనలు నలవు నలజడి గాక జీవులకు యింక నివి గనిన సిరు లవి యేమి బ్రాతి పె.అ.రేకు:0046-04 గౌళ సంపుటము: 15–261 పల్లవి: తరితీపులఁ బెట్టీని తనముందర నిప్పుడు హరి మాయ యింకా నెంత ఆసల ముంచీనో చ. అన్ని వేడుకలు గల యఖిల ప్రపంచము కన్నులు మూసితే నెక్కడ నుండునో చెన్నుమీఱ గృహారామక్షేత్రాదు లవి యెల్లా యెన్నఁగా నిద్రించేవేళ యేడ నుండునో చ. వొసఁగ త్రా భోగించిన భోగోపకరణములు యొసగఁ గొన కెక్కితే నేమి సేసునో వనమైన పుత్రమిత్ర వర్గంబు లెల్లాను వెసన వేరొక్క జన్మపువేళ నెట్టు లుందురో చ. పరగఁ దాఁ జేసిన పాపము శ్రీవేంకటేశు శరణాతుఁడైతే నే చందమగునో అరుదైన తనతొంటి యజ్ఞానము లన్నియును గురుకృపగలవేళ కొంచి యెందు దాఁగునో రేకు:0260-03 నాట సంపుటము: 03–345 పల్లవి: తల మొలా నొక్కసరా తను వొక్కటౌఁగాక కొలఁది యెలఁగత్రనిఁ గొలువరో మీరు చ. బొడ్డున బ్రహ్మఁ గనిన పురాణపురుషుఁడే దొడ్డుఁగాక ఆతని తోడివాఁడ(డా?) వొడ్డిన కైలాసమే లేవు మాపతిఁ గడుపులో వెడువెట్టి పెంచేవాఁడు వీరితోవాఁడా చ. చక్కని కన్నుల సూర్యచంద్రులుగాఁ గలవాఁడు యొక్కుడుగా కిందరిలో నీడువెట్టేదా అక్కర యీ దేవతల కాపద మానిపేవాఁడు