పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

575 పరులకెల్లా నింతేసి భ్రమత లేలయ్యా చ. హితులు వేదరాసులు యిల్లాలు వివేకము సుతుఁడు తనలోపలి సుజ్ఞానము గతి శ్రీ వేంకటేశుఁడె కలవాఁడుప్రాణులకు మతిమంతుల కిందులో మఱపు లేదయ్యా రేకు:0258-05 మలహరి సంపుటము: 03-335 పల్లవి: తమ యెఱుక తమకుఁ దగినంతే నెమకిన మాకును నీకృప యింతే చ. పొఁగ నీ నాభినిఁ బుట్టిన బ్రహ్మలు యెసఁగిన నీ పూర్వ మెఱిఁగేరా వెస నీ ముఖమున వెడలిన వేదము దెల నీమహిమ తెలియఁగఁగలదా చ. నగుచు నీమాయల నడచే జగములు సాగసి నీ మూరిత్రి చూపెడినా త్రగ నినుఁ గానఁగ త్రపించు మునులును పొగరుల మము నిఁక బోధించేరా చ. అంతేసివారల కటువలె నుండఁగ వింతజీవులకు వివేక మెట్టొకో యింతట శ్రీవేంకటేశ నీవే మము చెంతఁజేరి దయసేయఁగదే పె.అ.రేకు:0028–04 శంకరాభరణం సంపుటము: 15-162 పల్లవి: తమవుద్యోగము లేల తమకము లేల సముఁడై పుణ్యపాపాలు సాధించనేరఁడా చ. పుట్టిఁచ నేర్చిన హరి పూఁచి రక్షింప నేరఁడా వట్టి చింతతో జీవులు వగవ నేల జట్టిగొని పదునాలు జగము లేలెడి వాఁడు గట్టిగా నందరిఁ దానె కావ నేరఁడా చ. అంతరాత్మెనవాఁడు అన్నియుఁదా నేరఁడా వింతలుగా వేరెవిన్నవించ నేల సంతతమై గుణములు జవకట్టినట్టివాఁడు కొంతనేర్పు నేరాలు కోరి తిద్ద నేరఁడా చ. యేలికై దాసులనెల్ల యేల నేర్చినవాఁడు యీలీల సంపదలెల్ల యియ్య నేరఁడా వాలించి శ్రీవేంకటాద్రి ప్రత్యక్షమయినవాఁడు సాలిఁ దన మహిమలు చూప నేరఁడా పె.అ.రేకు:0046-06 సాళంగనాట సంపుటము: 15-263 పల్లవి: తమసత్వ మెఱిఁగియ దాఁచిరి గాకా తము నేలే రాము స్వతంత్రము చూపవలసి చ. హనుమంతునితోఁక నసురులందరుఁ గూడి మును లంకలో నగ్ని ముట్టించే వేళను 'అనలము శీతో భవ' యన నేరిచిన సీత పనివి 'రావణ హతో భవ' యన నేరదా చ. అంకెల జలధి దాఁటి యుట రాముని ముద్రిక సంకె లేక చేతఁ బట్టి సాహసమునా లంకాధిదేవతయైన లంకిణిఁ గొట్టినవాఁడు