పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

574 యిల నింతటిదైవ మింకఁ దెచ్చేరా చ. నారదశుకాదులెల్ల నమ్మినదైవ మితఁడు కూరిమి భూకాంతకు కులదైవము ఆరీతి శ్రీ వేంకటాద్రిమీఁది దైవము నేరితి యింతదైవము నెమకి తెచ్చేరా రేకు:0275-06 దేవగాంధారి సంపుటము: 03-435 పల్లవి: తప్ప లెంచకిఁక దరి చేర్చవయ్యా చెప్పనేల నీ చిత్తమయ్యా చ. కలిదోషహరణ కర్మవిదారణ సులభపు నీ దాసులమయ్యా కలిగిన శరణాగత వజ్రపంజర వలనగు నీ మరఁగువారమయ్యా చ. దులిత్రనివారణ దుఃఖవిమోచన దొరకొని నీ భక్తులమయ్యా కలిరాజవరద కరుణాసముద్ర సరి నిను నమ్మిన జంతులమయ్యా చ. శ్రీకాంత ప్రియ శ్రీవేంకటేశ్వర కై కొన్న నీ కింకరులమయ్యా మాకేల యితరపు మతదైన్యంబులు పైకొనఁ బోఁజేసి పాలించవయ్యా రేకు:0259-05 దేసాక్షి సంపుటము: 03–341 పల్లవి: తప్పులు వొప్పులు దేహి తన మూలమే రెప్పలతుద నివిగో రేపులు మాపులును చ. తనలోని పాపములే తగిలి యెదిటివారి నినుపు నేరములై నిందింపించు మనసులో పుణ్యములే మహిఁ గన్నవారిమీఁద పొనుఁగని నేరుపులై పొగడింపించును చ. తొల్లిటి మరణములు తోడనే పుట్టినపుడే యెల్లవారుఁ జూడఁగాను యేడుపించును పెల్లురేఁగి తాఁజేసే పెనుఁ గర్మబంధములే మెల్లనే నానాఁటికి మేను గొప్పచేసును చ. సావిఁ దన నడకలే స్వర్గనరకములై జీవులకు మాయగప్పి చిక్కింపించు శ్రీవేంకటేశ్వరు సేవ చేతిలోని మోక్షమై కేవలపు ప్రపంచము గెలుపించును పె.అ.రేకు:0018-02 బౌళి సంపుటము: 15-100 పల్లవి: తమ తమ యంతటికి తమవారె గుమిగూడు కొను టింతె కొసర నేలయ్యా చ. తల్లి శ్రీ మహాదేవి తండ్రి పురుషోత్తముఁడు తొల్లె దేవత లెల్ల తోడఁబుటూ పొల్లగారు జీవులెల్ల పుట్టి పోదురు వత్తురు చెల్లఁబో యిందులకుఁగా చింత లేఁటికయ్యా చ. హరిభక్తులేలికలు ఆచార్యుఁడొక్కఁడే దాత పరమాత్ము నామములే బంధువులు సరవి జంతువులకు సంసారమే ధర్మము