పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

573 నెమ్మి నీకే మొక్కితిమి నీవే మమ్ముఁ గాతువు చ. పరులఁ గొలిచి వచ్చి ప్రాణాచారాలు పడితే సిరుల వరాలిచ్చేవు శ్రీవేంకటేశా వొరులఁ గొలువము నే మొగి నీ పాదాలే నమ్మి నిరతిఁ గొలిచితిమి నీవే మమ్ముఁ గాతువు పె.అ.రేకు:0044-02 భైరవి సంపుటము: 15-248 పల్లవి: తప్పని బొంకని యట్టి దామోదర నాకు దప్పిదేర మో వియ్యవో దామోదరా చ. తరితీపుమాట లెల్ల దామోదరా నీకు తరుణులు వేరిపిరా దామోదరా దరిచేరె సంకు నీచే దామోదరా నీవు త్రరగలివె త్రగు రావెూదరా చ. తగులు వీరి పందేల దామోదరా నీ తగవు లేల చెప్పేవు దామోదరా దగదొట్టి పలికేవు దామోదరా వెను త్రగిలి త్రి విందాఁక దామోదరా చ. తల యెత్తు మా ముందర దామోదరా నీ త్రళుకువెూవి చూచి దామోదరా తలకొరిని కూడిత్రివి దామోదరా యింక తలఁగకు శ్రీవేంకటదామోదరా రేకు:0238-03 ధన్నాసి సంపుటము: 03-218 పల్లవి: తప్పించుకోరా దిఁక దైవమే గతి యెప్పుడు నుద్ధరించేవారెవ్వరును లేరు చ. మలసి దేహానందమే మరిగిన యాత్మకు తొలుత బ్రహ్మానందము దొరకదు అలవాటై క్షుద్రభోగాలందుఁ జిక్కిన యాత్మకు బలిమి విరతిఁ బొOద బలపడదు చ. సర్వదా బ్రహ్మాండములోఁ జరియించే యాత్మకు నిర్వహించి వెడలఁగ నేరుపు లేదు వుర్వి లోపలి చింతలుడుగని యాత్మకు నిర్వికారభావము నెలకొనదు చ. విరసవర్తనలనే వెలసేటి యాత్మకు పరగఁ బేదలమీఁది భక్తి పుట్టదు ధరలో శ్రీవేంకటేశుదాసుఁడుగాని యాత్మకు వెర పేమిటా లేదు వెదకి చూచినను పె.అ.రేకు: 0034-02 దేవగాంధారి సంపుటము: 15-190 పల్లవి: తప్ప జదువులవార తర్కవాదములవార యెప్పుడు నింతట దైవ మింకఁ దెచ్చేరా చ. కోరి సప్త ఋషులును కొలిచేదైవ మితఁడు చేరి మహాశేషుఁడు మోచిన దైవము గారవపు టాదిలక్షికైకొన్న దైవ మితఁడు మేరతో నింతదైవము మీరు దెచ్చేరా చ. అల బ్రహ్మకునుఁ దండ్రియైన దైవ మితఁడె తలప రుద్రునికిన తాత యితఁడె వెలయ వేదములెల్ల వెదకే దైవ మితఁడు