పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

572 తక్కక మోక్షమింతాఁ దనలోనిది చ. యెంత విచారించుకొన్నా నేనేమి చదివినా నెంతవారికైనా మోక్షమిందులోనిది వింతగా శ్రీవేంకటవిభుని సంకీర్తనవంతులకు మోక్షము వదనములోనిది రేకు:0091-01 శ్రీరాగం సంపుటము: 01-447 పల్లవి: తప్పఁ దోయవే దైవశిఖామణి యిప్పుడు నీకృప నెనసితి నేను చ. అనలముఁ బొడగని యుటునిటు మిడుతలు కినిసి యందు మగ్గినయట్లు అనువగువిజ్ఞాన మాత్మ వెలుఁగఁగ మొనసి OుOద్రియములు మూఁగీ నాకు చ. అట్రిముeటిఁ గమలము లటు వికసించిన మెఱసి తుమ్మిదలు మించుగతి తఱి నాహృదయము తగవికసించిన తఱమీ నజ్ఞానతమ మది నాకు చ. యీరీతి శ్రీవేంకటేశ్వర యిన్నియు నూరకే యుండఁగా నొదిఁగియుండె నేరిచి నీభక్తి నిలుపఁగ మదిలో చేరగతిలేక చిమిడీ నదివో రేకు:0078-02 లలిత సంపుటము: 01-371 పల్లవి: తప్పదు తప్పదు దైవము కృపయిది ముప్పిరి నింతా ముకుందుఁడే చ. వెక్కసపుమతి వెలుతురుదీరిన నెక్కడ చూచిన నీశ్వరుఁడే గుక్కక యాసలు గోసివేసినను నిక్క మడుగడుగు నిధానమే చ. పొంచి శరీరపు భోగము లుడిగిన చుంచుఁబావములు సుకృతములే దంచెడివిషయపుతగులమిఁ బాసిన యెంచిచూచినను యివాహమే పరము చ. శ్రీవేంకటపతిసేవే కలిగిన వేవేలువగలు వేడుకలే చేవదీరె సందియము లేదిదే భావము నమ్మిన ప్రసన్నులకును రేకు:0223–03 సాళంగనాట సంపుటము: 03–128 పల్లవి: తప్పదు యీయర్ధము ధరణిలోన వొప్పగ యేకచిత్తాన నుండవచ్చు నిఁకను చ. కాకాసురు దోషము కడకుఁ బరిహరించి చేకొంటివి శరణంటే చేరి మగుడ యీకడ మా నేరములు యింతకంటే నెక్కుడా నీకే నే శరణంటి నీవు మమ్ముఁ గాతువు చ. అమ్మున వేసినవాఁడు అట్టె దండము వెట్టితే నిమ్మల నిహపరము లిచ్చితివి యెమ్మెల మావంకనైతే నింతేసిచేఁతలు లేవు