పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

57.1 పోయిన జన్మముఁ బొగడేమయ్యా చ. శరణఁ జొచ్చితి జయముల హెచ్చితి దురితములెందో తొలఁగీని గరిమల శ్రీవేంకటపతిఁ గొలిచితి తరతర మిందే దక్కితిమయ్యా రేకు:0293–06 సామవరాళి సంపుటము: 03-541 పల్లవి: తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే మనసులోనే కలుగు మహామహిమ చ. కనురెప్ప మూసితేనే కడ దాఁగె జగమెల్ల కనుదెరచినంతనే కలిగెఁ దాను ననిచివుండుట లేదు నమ్మకపోవుట లేదు తనతోడిదే యిన్నిఁ దాఁ గలితేఁ గలవు చ. కడుపు నిండినంతనే క్రైపాయ రుచులెల్లా బెడిదపు టాఁకలైతేఁ బ్రియమాయను యెడనెడఁ జేఁదు గాదు యింతలోనే తీపు గాదు వొడలితోడివే యివి వుండినట్టే వుండును చ. అద్దములోఁ దననీడ అంతటా మెరసినట్లు పొద్దువొద్దు తనతోనే భోగాలెల్లా అద్దిన శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును పె.అ.రేకు:0019-04 బౌళి సంపుటము: 15-108 పల్లవి: తపముల బడలఁగ తమ కేల మునులకు నెప మిదె సాధించ నియ్యోడకు నింకను చ. అడుకులు వెట్టి నీచే నందెను సిరు లొకఁడు కడు గంపఁ గమ్మి దాఁచి కైవల్య మందె నొకఁడు కుడువఁ గూడు దెచ్చి కొందరు నీ వారైరి వడి నిట్టే యణకించవచ్చుఁబో నిన్నింకను చ. నీ తల పువ్వులు చుట్టి నిత్యుఁడాయె నొకఁడు కాతరాన గంద మిచ్చి కలసె నిన్నొక తె చేత బలుసాకు వెట్టి సిరులు గనె నొకఁడు యీతల నిన్ను చెల్లించే దేమి దొడ్డ యింకను చ. మంద గోపికల కడ మాటాడి మించె నొకఁడు కందువ నీకు దాసుఁడై కరుణఁ బొందె నొకఁడు యిందరు వరము లందిరిదె శ్రీ వేంకటేశుఁడ సందడి నిన్ను సేవించే సర విదె యింకను రేకు: 0269-01 లలిత సంపుటము: 03-395 పల్లవి: తప్పదీయర్థమొకటి దాఁచిన ధనము సుండీ విప్పరాదు చెప్పరాదు వేదమందు నున్నది చ. హరిభక్తి గలిగిన యతనికి మోక్షము పొరుగున నున్నట్టు పొసఁగినది దరిశనభక్తి చేఁ దనరినవారికి యిరవైన మోక్షము యెదిటిది చ. మక్కువ భాగవతాభిమానము గలవారి కక్కరలేని మోక్ష మరచేతిది నిక్కి యాచార్యాభిమాననిరతులైనవారికి