పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

570 ప్రాణి రక్షించు బొందిబడి దాఁ బోయనా చ. యెరవుల దేహలివి నిజమని నమ్మి యెరిఁగీనెఱుఁగలే రిది యాలా అరయం బరమునకు నాది పురుషుఁడై పరగుశ్రీ వేంకటపతి గలిగుండఁగా రేకు: 0037-03 ఆహిరి సంపుటము: 01-229 పల్లవి: తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁడెవ్వఁడు తనుగుణముల దిగవిడిచినధన్యుం డాతఁడెపో చ. తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటిన విగతభయుం డతఁ డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకో పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి జగదేకప్రీతుండగుచతురుం డాతఁడెపో చ. యేచినపరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన ధీచతురుం డతఁడెవ్వఁడు ధీరుం డెవ్వఁడొకో చూచిన మోహపుఁజూపులఁ జురుచూండ్ల కెడమియ్యని రాచeటికపు నెరజాణఁడు రసికుం డాత్రcడెపాశీ చ. చావుకు సరియగు ద్రవ్యవిచారపు తుగులులఁ బాసిన పావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన - దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో పె.అ.రేకు: 0049-06 లలిత సంపుటము: 15-280 పల్లవి: తనివి లేక చీఁకటి దవ్వీ దేహి ఘనుఁడై హరిఁ గొల్చితే కైకొని రక్షించఁడా చ. అంది రసవాదమున కాసపడేటి మనసు గొంది బిలములు చొచ్చి కూడపెట్టేటి మనసు సందించి మంత్రవాదాన సాదించేటి మనసు యిందిరేశుపైఁ బెట్టితే నిన్నియు నొసఁగఁడా చ. నెట్టన నంజనగాఁడై నేల దవ్వించే మనసు అట్టే కాయసిద్ధికిఁగా నాసపడేటి మనసు పట్టి సిద్ధమూలికలవసఁ జిక్కేటి మనసు దిట్టయై కృష్ణుని మీఁదఁ బెట్టితే మన్నించఁడా చ. చేరి యక్షిణుల పంపు సేయించుకొనే మనసు ఆరయ రాక్షసమాయ నభ్యసించేటి మనసు యీరీతి శ్రీవేంకటేశు హృదయములోఁ దలఁచి పేరుకొని నుతించితే పెంపున నీడేర్చఁడా రేకు:0277-03 లలిత సంపుటము: 03-444 పల్లవి: తనిసితి మిన్నిటి తగులేలో మినుకుల దినముల మెచ్చేమయ్యా చ. మనసూ రోసితి మరులూఁ బాసితి తనువేలో పైతరవాయ వెనకాఁ దెలిసిత్రి మునుపూఁ జూచిత్రి నను నేనే యిఁక నవ్వేమయ్యా చ. మూయుల వెడలితి మమతల బడలితి పాయంబేలో పదరీని దాయల గెలిచితి ధర్మముఁ బిలిచితి