పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

569 పె.అ.రేకు:0077-06 శంకరాభరణం సంపుటము: 15-446 పల్లవి: తనమనసే తనకు తారుకాణవచ్చుఁ గాక వినుకలి పరబుద్ధివీనులఁబట్టీనా చ. చుట్టమైనవాఁడు తనచోటికి నమ్మికె గాక వెట్టివాఁడు సత మౌనా వేగినంతతాను అట్టే తనయింటి యన్నమాఁకటి కొదగుఁ గాక పొట్టఁబొరుగు విందులు పొద్దు దప్పకుండునా చ. వాడియైన యిల్లాలు వంశమున కెక్కుఁగాక కూడగొట్టుకాంత తనకుల మయ్యినా వాడలో మంచిగుణము వాసి వన్నేఁ దెచ్చుఁగాక యేడనైనా యపకీర్తి హీనమే కాదా చ. యొక్కువ హరిఁ గొల్చితే నిహపరము నిచ్చుఁ గాక తక్కిన దేవత లింతటి కోపేరా చక్కని శ్రీవేంకటేశుఁడు సర్వాంతురాత్మకుఁడు తక్కక మనుజులాల తలఁచి బ్రదుకరో రేకు: 0147-03 కేదారగెళ సంపుటము: 02-213 పల్లవి: తనలోనుండిన హరి దాఁ గొలువఁడీ దేహి యెనలేక శరణంటే నితఁడే రక్షించును చ. కోరి ముదిమి మానుపుకొనే యాస మందులంటా వూరకే చేఁదులు దిన నొడఁబడును ఆరూఢి మంత్రసిద్దుఁడనయ్యేననే యాసలను ఘనోరపుఁబాట్లకు గక్కున నొడఁబడును చ. యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనే యాసలను వొట్టి జీవహింసలకు నొడఁబడును దిట్టతనముఁ దా నదృశ్యము సాధించే యాస జట్టిగ భూతాలఁ బూజించఁగ నొడఁబడును చ. చాపలపు సిరులకై శక్తిఁ గొలిచే యాసను వోపి నిందలకు నెల్లా నొడఁబడును యేపున శ్రీవేంకటేశుఁ డేలి చేపట్టినదాఁకా ఆఁపరాని యాస నెందుకైనా నొడఁబడును రేకు: 0036–03 వరాళి సంపుటము: 01-222 పల్లవి: తనవారని యాస దగిలి భ్రమయనేల తనువుఁ బ్రాణునికంటె తగులేది చ. తనువుఁ బ్రాణుడు రెండు తగిలి గర్భమునందు వొనర నేకమై యుదయించి దినములు చెల్లిన తివిరి యాప్రాణుఁడు తనువువిడిచిపోయ దయలేక చ. ప్రాణికై దేహము పాపపుణ్యము సేయు ప్రాణి వెంటనె బొంది పాశుండదు ప్రాణి యచ్చటనైన బాధలఁ బడకుండ