పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

568 చ. విడిచెనా తన పాపవిధులు ప్రాణుఁడు మున్ను అడరి మానుష రూప మైనంతనే చెడక వేంకటపతి సేవించి సకలము కడుగుకొనెడి ಬುದ್ದಿ కనవలె(గాక రేకు: 0032-04 నాట సంపుటము: 01-198 పల్లవి: తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచలబుద్ధి మానీనా చ. జడుమానవుఁడు చదువCజదువ నాస వడ్డివారుఁగాక వదలీనా గుడ్డికుక్క సంతకుఁబోయి తిరిగిన దుడ్డుపెట్లే కాక దొరకీనా చ. దేవదూషకుఁడై తిరిగేటివానికి దేవతాంతరము తెలిసీనా శ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాక పావనమతియై పరగీనా చి.ఆ.రేకు:0003-05 బౌళి సంపుటము: 10-017 పల్లవి: తనకోరిక లేఁటికి నాతఁడె యిన్నియుఁ గల్పించఁగ అనువుగ నిందుకు యిద్దరియత్నంబులు వలెనా చ. అద్దముచూ చెటియాతఁ డలరుచు నవ్విన నవ్వును అద్దములోపలినీడయు నారీత్రినె కాదా గద్దరియగు శ్రీవిభుసంకల్పంబుననె జగముల సుదులు దుఃఖము సుఖమును OেPওঁ3CaOCড়ে তেPতP చ. నాఁటక మూడించునతఁడు నయమునఁ గదలింపంగా నాఁటక మందలిబొమ్మలు నానాగతిఁ జెలఁగున్ ఆటలఁ జేతన్యాత్మకుఁడగు దేవుని చేష్టలనె పాటిగఁ బాపముఁ బుణ్యము బహుళం బగుఁగానా చ. అరదము నడపెటిసారథి యటునిటు వాగెటు వట్టిన అరదముగుఱ్ఱములు మెలఁగు నాయూముఖములను నరులను శ్రీవెంకటగిరినాథుఁడె తగ బ్రేరింపఁగ గరవము లేమియుఁ గలిమియుఁ గలిగుండుఁ గానా రేకు:0020–06 సామంతం సంపుటము: 01-124 పల్లవి: తనదీఁగాక యిందరిదీఁగాక తనువెల్ల బయలై దరిచేరదు చ. కడుపూ నిండదు కన్నూఁ దనియదు కడఁగి లోనియా(కలియుఁ బోదు సడిఁబడి కుడిచినకుడు పెల్ల నినుము గుడిచిన నీరై కొల్లఁబోయె చ. చవియూC దీరదు చలమూఁ బాయదు లవలేశమైన నొల్లకపోదు చివచివ నోటికడవలోనినీరై కవకవ నవియుచుఁ గారీని చ. అలపూఁ దోఁపదు అడవీ నెండదు యెలయించు భంగమయునఁ బోదు తెలసి వేంకటగిరిదేవునిఁ దలఁపించు తలఁపైనఁ దనకు ముందర నబ్బదు