పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

567 చ. పట్టి జవ్వనమదము పఱచఁగా దుఃఖించఁడు అట్టే తాను జన్మించినయందుకు దుఃఖించడు నెట్టన శ్రీవేంకటేశ నీ బంటుఁగాఁ జేసుకొని గట్టిగా దుఃఖ ముడిపితే కాచుకొని సుఖించును రేకు:0211-01 దేసాళం సంపుటము: 03-061 పల్లవి: తన సామ్మీడేరించక తా మానీనా పెనఁగుచు నే మూరకే బిగిసేముఁ గాక చ. భూమితోఁ బ్రపంచ మెల్లఁ బుట్టించిన దేవుఁడు ఆ మీఁది పారుపత్యాన కందుకోపఁడా నామమాత్ర జీవులము నడుమంతరాల వచ్చి నేము గర్తల మనుచు నిక్కేముఁ గాక చ. యెనలేక యెదిరికి ఇనుమడిచేవారికి తన తగర మడువఁ దడవయిన్యానా గునిసి సంసారపు కొండనే మోచేనంటా తినికేమిదియు వట్టి దీమసముఁ గాక చ. చిత్తములో నున్నట్టి శ్రీవేంకటేశ్వరుఁడు మత్తిల్లి ననుఁ గావక మానఁబొయ్యీనా కొత్తగా నీతని నేఁడు కొలిచేమనుచు నేము తత్తరపు స్వతంత్రానఁ దగిలేముఁ గాక రేకు:0010-05 కన్నడ గౌళ సంపుటము: 01-065 పల్లవి: తనకర్మవశం బించుక,దైవకృతం బొకయించుక మనసు వికారం బించుక, మానదు ప్రాణులకు చ. ఈదైన్యము లీ హైన్యము లీచిత్తవికారంబులు యీదురవస్థలు గతులును OూలOపటములును యీదాహము లీదేహము లీయను బంధంబులు మరి యీదేహముగలకాలము యొడయవు ప్రాణులకు చ. యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు నీచొక్కులు నీపాక్కులు నీ వెడయలుకలును యీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు నీచిత్తముగలకాలము యొడయవు ప్రాణులకు చ. యీవెరవులు నీయెరుకవులు యీతలఁపులు నీతెలువులు దైవశిఖామణి తిరుమల దేవునిమన్ననలు దైవికమున కిటువగనక తనతలం పగ్గలమైనను దైవము తానౌ తానే దైవంబవుఁగాన రేకు: 9029-03 నాట సంపుటము: 04-549 పల్లవి: తనకేఁటి యేతులిందరిలోన పెనఁగుచు నూరక బిగిసీఁగాక చ. మరచెనా తనపాటు మాలజీవుఁడు దొల్లి కొరెరమూలి బహుయోనికూపముల పొరలి హేయములోనె పుంగుడువడి వచ్చి మొరఁగి తా దొరనంట మురిసీఁగాక చ. పాసెనా తనపాటు పాపదేహి తా గాసిఁ బడిన భంగములెల్ల చేసిన తనతొంటి చేఁతలన్నియును మాసెననుచు నిట్టె మలసీఁగాక