పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

566 చ. శ్రీవేంకటపతి చింత యంత నేఁడే భావపరవశము పలుకూ నంతే దైవము కృప యంత తానూ నంతే యేవంక జయమెంత యిరవూ నంతే రేకు:0299-01 శంకరాభరణం సంపుటము: 03-572 పల్లవి: తన చిత్తము కొలఁది తమకించ నిఁకనేల మనసు వచ్చినప్పుడే మన్నించీఁ గాక చ. కొండలందు నదులందుఁ గోరి యూకసాన భువి నిండియున్నాఁడు తొలుతే నీలవరుఁడు అండనే నా యందు లోకులందు నుండుటరుదా గండికాఁడై తన మాయ గాననీఁడుఁ గాక చ. గాలియై పంచమ(?) వాద్యగతులై శబ్దములై ఆలకించి పలికీని యాదిమూరితి నాలుక కొననే వుండి నానాభాష లాడీని కాలముతో నెదిరికిఁ గాననీఁడుఁ గాక చ. వేదమందు శాస్త్రమందు వేవేలు వాదములందు పాదుకొని బోధించీఁ బరమాత్ముఁడు యీదెసనే శ్రీవేంకటేశుఁడై పొడచూపె గాదిలి తన దాసులఁ గరుణించీఁ గాక చి.ఆ.రేకు:0007-01 సాళంగనాట సంపుటము: 10-037 పల్లవి: తన దాసునికొరకు ధరియించె నీరూపము దిన దిన వేడుకఁ గదిరి నారసింహుఁడు చ. బలురక్కసు నొడిసిపట్టి తొడలపైఁ బెట్టి చెలఁగి కొనగోళ్లఁ జించినాఁడు చలపట్టి పేగులజంధ్యాలతోడుతను తెలివై వున్నాఁడు కదిరి నారసింహుఁడు చ. ఫెురధానవు కంఠకుహర రక్తము ముంచి సారెకు వసంతముగాఁ జల్లినాఁడు మారుకొన్నదైత్యుని చర్మ మొలిచి మేనిమీఁద ధీరతఁ గప్పినాఁడు కదిరి నారసింహుఁడు చ. అందపులక్షియు బ్రహ్లాదుఁడు నుతింపఁగాను విందుగా నాగము పాల వెలసినాఁడు అంది శ్రీవెంకటనాథుఁడై యీడా నాడాను దిందుపడున్నాఁడు కదిరి నారసింహుఁడు పె.అ.రేకు : 0065–05 రామక్రియ సంపుటము: 15-374 పల్లవి: తన పాటెంచు కోఁడు దైవమా యీ యాతుమ గాచి ఘనవివేకంబొసంగి కాణాచిగా నేలఁ గదే చ. బలుకాంక్షలు ముందల పట్టి తియ్యఁగా దుఃఖించఁడు తొలఁగ క్రోధము రొమ్ముఁ చోక్కఁగా దుఃఖించుఁడు బలిమితో లోభము తన్ను బాధించఁగా దుఃఖించఁడు వలవంత దేహి చన్నవారికి దుఃఖించును చ. తను నీషణత్రయము దండించఁగా దుఃఖించఁడు మన సేడకైనాఁ బోయి మరుగఁగా దుఃఖించఁడు ఘనమోహాంధకారము కలఁచఁగా దుఃఖ9ంచఁడు మును చన్నవారికిఁగా మొనసి దుఃఖించును